Advertisement

ఇక కాంగ్రెస్‌ వంతు!


కేసీఆర్‌ ప్రస్తుతం టార్గెట్‌ కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకున్నారు . ఇప్పటికే ఆయన టిడిపిని దాదాపు ఖాళీ చేశారు. ఆపరేషన్‌ ఆకర్ష్‌తో 15మంది ఎమ్మెల్యేలున్న పార్టీలో కేసీఆర్‌ దెబ్బకు కేవలం ముగ్గురు మాత్రమే మిగిలారు. వారే రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఆర్‌.కృష్ణయ్య. వీరిలో ఆర్‌.కృష్ణయ్య ఎమ్మేల్యేగా కంటే బిసీ నేతగా ఉండటానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక ఓటుకు నోటు వ్యవహారంలో నిందితుడైన ఖమ్మం జిల్లాకు చెందిన సండ్ర వెంకట వీరయ్య త్వరలోనే గులాబీ కండువా కప్పుకోనున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఇక వైయస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ విషయానికి వస్తే ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేని శ్రీనివాస్‌రెడ్డితో పాటు మరో ఎమ్మేల్యేలను తమ పార్టీలో చేర్చుకున్నారు. దీంతో టిఆర్‌ఎస్‌లో టిడిపి, వైయస్సార్‌సీపీల విలీనం పూర్తయినట్లే. కాగా ప్రస్తుతం కేసీఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మీద కన్నేశాడు. మే26న జరగనున్న రాజ్యసభ ఎన్నికలలోపు కాంగ్రెస్‌ నుండి ముగ్గురిని, టిడిపి నుండి ఒకరిని తమ పార్టీలో చేర్చుకొని ఖాళీ కానున్న రెండు రాజ్యసభ స్ధానాలను తామే గెలుచుకునేలా వ్యవహారం నడుపుతున్నాడు కేసీఆర్‌. కాంగ్రెస్‌ నుండి టిఆర్‌ఎస్‌లో చేరనున్న ముగ్గురు ఎమ్యేల్యేలలో ఒకరు నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మేల్యే కాగా మరో ఇద్దరు మహబూబ్‌నగర్‌కు చెందిన వారని సమాచారం. అయితే ఇతర ఎమ్మేల్యేలను మూకుమ్మడిగా పార్టీలో చేర్చుకోకుండా కాస్త వ్యవధి ఇస్తూ వారిని పార్టీలో చేర్చుకోవాలని... తద్వారా మిగిలిన ఎమ్మేల్యేలతో మైండ్‌ గేమ్‌ ఆడాలని కేసీఆర్‌ వ్యూహంగా తెలుస్తున్నది. మొత్తానికి కాంగ్రెస్‌ను కూడా ఖాళీ చేయాలన్నది కేసీఆర్‌ వ్యూహం అంటున్నారు. సో.. ఇక కాంగ్రెస్‌ ఎమ్మేల్యేలు ఎందరు టిఆర్‌ఎస్‌ వైపు చూస్తారో వేచిచూడాల్సివుంది...! 

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement