Advertisement

రెడ్డి ఓట్ల కోసమే పొంగులేటి!


తెలంగాణ వైకాపా రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి తెరాసలో చేరికకు రంగం సిద్ధం చేశారు. కొద్ది నెలలుగా పొంగులేటి తెరాసలో చేరతారని ప్రచారం జరుగుతోంది. సరిగ్గా సమయం కోసం చూసి కేసీఆర్ పచ్చజండా ఊపారు. 

Advertisement

అకస్మాత్తుగా వచ్చిన పాలేరు ఉప ఎన్నికకు పొంగులేటి చేరికకు లింకు ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. పాలేరులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెరాస అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ తరుపున దివంగత ఎమ్మెల్యే భార్య సుచరిత రెడ్డి పోటీలో ఉన్నారు. సానుభూతి కారణం చూపుతూ తెదేపా పోటీలో లేదు. అంటే కాంగ్రెస్ కు తెదేపా మద్దతు ఉందన్నమాట. దీంతో కాంగ్రెస్ అభ్యర్ధికి విజయావకాశాలు కొంతమేర పెరిగాయి. 

తెరాస అధినేత తెలంగాణలో తమకు ఎదురుండకూడదనే భావిస్తారు. ఎక్కడ ఎలాంటి ఎన్నికలు జరిగినా తెరాస అభ్యర్థులు గెలవాల్సిందే. దీనికోసం ఎలాంటి వ్యూహాలైనా సరే అమలు చేస్తారు. 

పాలేరులో రెడ్డి సామాజిక వర్గపు ఓటర్లు ఎక్కువ. ఇది కాంగ్రెస్ అభ్యర్థికి కలిసివచ్చే అంశం. కమ్మ సామాజికవర్గం ఓట్లు బహుతక్కువ అందువల్ల తుమ్మలకు కొంత ఇబ్బంది. రాజకీయాల్లో సంక్షేమ పథకాల కంటే కులానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని తెలిసిందే. దాంతో పాలేరులో ఏకపక్షంగా గెలుస్తామనే నమ్మకం తెరాసలో సడలింది. పైగా తుమ్మల గత ఎన్నికల్లో తెదేపా తరుపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. దాంతో పాలేరులో గులాబి జండా ఎగరేయాలంటే రెడ్డి సామాజిక వర్గపు ఓట్లలో చీలిక తేవాలి. ఖమ్మంలో బలమైన నాయకుడు, ఆర్థికంగా బలవంతుడైన పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై తెరాస కన్ను పడింది. ఆయనను చేర్చుకోవడానికి ఇదే సరైన సమయంగా పావులు కదిపారు. కేటీఆర్ రంగంలోకి దిగారు. పార్టీ మారితే ప్రయోజనాల గురించి వివరించారు. అభయం ఇచ్చారు. దాంతో తెలంగాణ వైకాపా రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉన్న పొంగులేటి జై కేసీఆర్ అనేశారు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement