Advertisement

రాజమౌళీ గారు మీరు చేసేది కరెక్టేనా?


టాలీవుడ్‌లో నంబర్‌వన్ దర్శకుడిగా వున్న ఎస్.ఎస్.రాజమౌళి.. ‘బాహుబలి’ చిత్రంతో దర్శకుడిగా దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాడు. భారతదేశ ప్రముఖ దర్శకుల్లో ఒకరిగా స్థానం సంపాందించుకున్నాడు. అయితే కెరీర్ ప్రారంభం నుంచే ఈ దర్శక ధీరుడికి అవార్డులు అందుకోవడం ఇష్టం లేదు. అందుకే తనకు ఎలాంటి అవార్డులు వచ్చినా వాటిని స్వీకరించడానికి వెళ్ళడం.. ఫంక్షన్‌కు హాజరుకావడం వంటివి రాజమౌళి విషయం లో జరుగలేదు. అయితే కేంద్ర ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారాల్లో ఒకటిగా భావించే పద్మశ్రీ పురస్కారానికి  ఎంపికైన రాజమౌళి.. ఆ పురస్కారాన్ని అందుకోవడం కూడా సందేహమే అంటున్నారు. ఇటీవల ఢీల్లిలో జరిగిన ఈ పురస్కారాల వేడుకలో కొంత మందికి ఈ పురస్కారాన్ని అందజేశారు. త్వరలోనే జరిగే రెండో సెషన్‌లో రాజమౌళికి ఈ పురస్కారాన్ని అందజేస్తారు. అయితే ఈ వేడుకకు రాజమౌళి  స్థానంలో ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరు ఆ వేడుకకు వెళతారని సమాచారం. అంతేకాదు ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డుల్లో రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘బాహుబలి’చిత్రం జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైన సంగతి తెలిసిందే. తొలిసారిగా జాతీయ అవార్డుల్లో  ఓ తెలుగు చిత్రానికి లభించిన అత్యున్నత పురస్కారం ఇది. అయితే ఈ వేడుకకు కూడా రాజమౌళి హాజరుకావడం సందేహామేనని అంటున్నారు ఆయన సన్నిహితులు. ప్రవైట్ అవార్డు వేడుకలను, ప్రభుత్వ పురస్కారాలను రాజమౌళి ఒకే విధంగా చూడటం సరికాదని, ఈ విషయం లో రాజమౌళి చేసేది కరెక్ట్ కాదని అంటున్నారు సినీ ప్రముఖులు. 

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement