Advertisement

విజయ్‌ అదరగొడుతున్నారు..!


ఇలయదళపతి విజయ్‌ హీరోగా 'రాజు రాణి' ఫేమ్‌ అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'తేరీ'. ఈ చిత్రం థియేటికల్‌ ట్రైలర్‌ విడుదలై అదరగొడుతోంది. ఈ ట్రైలర్‌ ఎంతో స్టైలిష్‌గా ఉందని విజయ్‌ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సమంత హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో విజయ్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించనున్నాడు. ఎస్‌.థాను నిర్మిస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌ చూస్తే ఇందులో విజయ్‌ రజనీకాంత్‌లా కొన్ని స్టైలిష్‌గా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అర్థం అవుతోంది. చూయింగ్‌ గమ్‌ను రజనీ సిగరెట్‌ను నోట్లో వేసుకున్నట్లుగా వేసుకోవడంతో పాటు ఆయన పలు విధాలుగా రజనీని ఇమిటేట్‌ చేసిన సంగతి అర్థం అవుతోంది. మరి ఈ చిత్రం తమిళ ప్రేక్షకులను, విజయ్‌ అభిమానులను ఏమేరకు ఆకట్టుకుంటుందో వేచిచూడాల్సివుంది. కాగా ఈచిత్రంలో సీనియర్‌ నటులైన ప్రభు, రాధికా కీలకపాత్రలు పోషించనున్నారు. 

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement