Advertisement

'బాహుబలి' ప్రపంచంలోనే రాజమౌళి..!


దర్శకధీరుడు రాజమౌళి సినిమాలో నటించాలని అందరూ స్టార్‌హీరోలు కలలుకంటుంటారు. కానీ గత మూడేళ్లుగా ఆయన కేవలం 'బాహుబలి1', 'బాహుబలి2' చిత్రాలతోనే గడిపేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఆయన 'బాహుబలి2' చిత్రం షూటింగ్‌ జోరుందుకొంటోంది. ఈ చిత్రం పూర్తయ్యేసరికి ఆయనకు మరో ఏడాది పట్టడం ఖాయం. కాగా రాజమౌళి 'బాహుబలి2' తర్వాత 'బాహుబలి3' చేస్తారా? అంటే అప్పుడెప్పుడో చేయను.. అని బదులిచ్చాడు. తాజాగా ఆయన మాటమార్చి 'బాహుబలి'లోని నటీనటులను స్థానంలో వేరేవారిని తీసుకొని అయినా ఈ చిత్రానికి మూడోపార్ట్‌ కూడా తీస్తానని సమాధానం ఇస్తున్నాడు. హాలీవుడ్‌ సినిమాల మాదిరి ఆయన 'బాహుబలి' సీక్వెల్స్‌ పరంపరను వరసగా తెరకెక్కించినా ఆశ్యర్యం లేదు అంటూ సెలవిచ్చాడు. దీంతో ఆయనతో సినిమాలు చేయాలని ఆశపడిన స్టార్‌హీరోలు పూర్తిగా డిజప్పాయింట్‌ అవుతున్నారు. మొత్తానికి మన జక్కన్న 'బాహుబలి' సినిమాలోకంలోనే జీవిస్తూ, పూర్తిగా అదేలోకంలో మునిగిపోయేట్లు కనిపిస్తున్నాడు. 

Advertisement

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement