Advertisement

చైతూ కి తమన్నానే కావాలంట!


>స్టార్‌ హీరోల సరసన తమన్నా నటించిన చిత్రాలన్నీ అపజయాలనే మూటగట్టుకున్నాయి. ఒక్క ‘రచ్చ’ మాత్రమే దానికి  మినహాయింపు. అయితే ఆమె నాగచైతన్య సరసన నటించిన ‘100%లవ్‌, తడాఖా’ చిత్రాలు మాత్రం మంచి విజయాలు సాధించడంతో వీరిద్దరిది హిట్‌పెయిర్‌గా చెప్పుకోవచ్చు. కాగా ప్రస్తుతం నాగచైతన్య గౌతమ్‌మీనన్‌ చిత్రంతో యమాబిజీగా ఉన్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తికాగానే హారిక-హాసిని పతాకంపై రాధాకృష్ణ నిర్మాతగా చందుమొండేటి చిత్రం మొదలుకానుంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలో కూడా తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో తనకు జోడీగా తమన్నానే కావాలని చైతూ పట్టుబడుతున్నాడట. సెంటిమెంట్‌పరంగా కూడా తనకు తమన్నా అయితేనే కలిసొస్తుందనే పట్టుదలతో చైతూ ఉన్నట్లు  సమాచారం. 

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement