Advertisement

మెగాస్టార్‌ బర్త్‌డేకు ముమ్మర ఏర్పాట్లు!


>మెగాస్టార్‌ చిరంజీవి తన 30ఏళ్ల కెరీర్‌లో తెలుగు చలన చిత్రసీమను ఓ ఊపుఊపాడు.  ఈ ఆగష్టు 22న ఆయన 60వ వసంతంలోకి అడుగుపెడుతూ షష్ఠి పూర్తి చేసుకోనున్నాడు. మరో వైపు ఆయన నటించే 150 వ సినిమా కూడా అదే రోజున ప్రారంభం కానుందని సమాచారం. చిరు బర్త్‌డే సందర్బంగా అటు మెగాఫ్యామిలీ, ఇటు మెగాఫ్యాన్స్‌ ఏర్పాట్లు భారీగా చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. చిరంజీవి కెరీర్‌లో సూపర్‌హిట్‌గా నిలిచిన పలు చిత్రాలను బర్త్‌డే వారోత్సవాలలో భారీ స్క్రీన్లపై ప్రదర్శించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. పలు ప్రధాన నగరాల్లో భారీ ఫ్లెక్స్‌లు, రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక భారీగా జన సమీకరణ చేసి బైక్‌ ర్యాలీల వంటివి కూడా చేయనున్నారు. దేశం మొత్తం హాట్‌టాపిక్‌గా మారేలా.. జాతీయ మీడియాను కూడా ఆకర్షించేలా వేడుకలను నిర్వహించడానికి ప్రణాళికలు రచిస్తున్నారు!

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement