Advertisement

చరిత్రకు నందమూరి బాలకృష్ణ ఒక్కడే..?!


త్వరలో నందమూరి నటసింహం బాలకృష్ణ వందో సినిమా మైలురాయిని చేరుకోబోతున్నారు. ఈ సినిమా గురించి మీడియాలో అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. బాలయ్యతో 'లెజెండ్' వంటి భారి హిట్ సినిమాను నిర్మించిన సాయి కొర్రపాటి ప్రతిష్టాత్మక వందో సినిమాను నిర్మించే అవకాశం సొంతం చేసుకున్నారు. 'సింహా', 'లెజెండ్' సినిమాల సృష్టికర్త బోయపాటి శ్రీను దర్శకుడని ప్రచారంలో ఉంది. 100వ సినిమా అవకాశం వస్తే సంతోషమే. కానీ, ఇంకా ఖరారు కాలేదని పలు వేదికలలో దర్శక, నిర్మాతలు స్పష్టం చేశారు. తాజాగా వందో సినిమాకు టైటిల్ ఖరారు చేశారని ఓ వార్త గుప్పుమంది. 

Advertisement

'చరిత్రకు ఒక్కడు' అనే టైటిల్ పరిశీలనలో ఉందట. కన్ఫర్మ్ అని ఎవరూ ప్రకటించలేదు. అయితే, ఈ టైటిల్ బాలకృష్ణ స్థాయికి తగ్గట్లు ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిష్టాత్మక సినిమాకు చరిత్రలో నిలిచిపోయేలా పవర్ఫుల్ టైటిల్ ఉండాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం 98వ సినిమా 'లయన్'ను విడుదలకు సిద్దం చేసిన బాలకృష్ణ, త్వరలో శ్రీవాస్ దర్శకత్వంలో తెరకేక్కబోయే 99వ సినిమా 'డిక్టేటర్' షూటింగులో పాల్గొంటారు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement