Advertisement

రివ్యూ రాసేవారికి సుహాసిని నీతులు!


ఈమధ్య సినిమా రివ్యూలపై సినిమా వాళ్లు తమ ఆగ్రహాన్ని  బాహాటంగానే ప్రదర్శిస్తున్నారు. సినిమాలను రివ్యూ చేయడానికి మీరెవరు? అని ప్రశ్నిస్తున్నారు. మొన్నటికి మొన్న దర్శకుడు ప్రవీణ్‌సత్తార్‌ రివ్యూలు  రాసేవారిపై మండిపడ్డాడు. నిన్న గాక మొన్న త్రివిక్రమ్‌ కూడా అదే దోరణిలో నడిచాడు. సినిమాను సినిమాగా చూడలేకపోతున్నారంటూ విలేఖరులపై ఆయన తన పంచ్‌ తరహా డైలాగులు పేల్చాడు. ఇప్పుడు సీనియర్‌ నటి సుహాసిని మణిరత్నం కూడా అదే దోరణిలో మాట్లాడుతోంది. రివ్యూలు రాసే వారికి ఓ ప్రత్యేక అర్హత ఉండాలి. ఎవరు పడితే వారు రాయడానికి వీల్లేడు. కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్న ప్రతివాడూ రివ్యూలు రాస్తే ఎలా? అలా జరక్కూడదు. సీనియర్‌ జర్నిలిస్ట్‌లే రివ్యూలు రాయాలి. .. అంటూ ఉచిత సలహా ఇచ్చేసింది. అసలు ఈ సమయంలో సుహాసిని ఇలా మాట్లాడిరది ఏమిటబ్బా అనే కదా మీ ఆలోచన. దానికి కూడా ఓ మంచి రీజన్‌ ఉంది. త్వరలో మణిరత్నం దర్శకత్వం వహించిన ‘ఓకే బంగారం’ సినిమా విడుదలకు సిద్దమవుతోంది. దానిపై నెగటివ్‌ రివ్యూలు రాకుండా ఆమె ఇలా జాగ్రత్తపడుతోంది. మరి సుహాసిని ఇచ్చిన సలహాను రివ్యూలు రాసే వారు  ఏవిధంగా తీసుకుంటారు అనేది తెలియాల్సివుంది....!

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement