Advertisement

రంగస్థల దినోత్సవంనాడు ప్రతిజ్ఞ చేసిన నటీనటులు


మార్చి 27 ప్రపంచ రంగస్థల దినోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సినీ నటీనటులు హైదరాబాద్‌లోని ఫిలించాంబర్‌లో వున్న డా॥ డి.రామానాయుడు కళ్యాణ మండపంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పరుచూరి వెంకటేశ్వరరావు, సీనియర్‌ నరేష్‌, శివపార్వతి, రఘుబాబు, హేమ, కొండవలస, ఢల్లీి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

పరుచూరి వెంకటేశ్వరరావు: ఈరోజు ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోని కళాకారులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే రామానాయుడుగారి కళ్యాణమండపంలో మా కళాకారులందరం ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాం. రామానాయుడుగారి పుటినరోజైన జూన్‌ 6న సినిమా కళాకారులతో కూడిన ఓ నాటకాన్ని ప్రదర్శించాలని ప్రతిజ్ఞ మేం చేశాం. 

నరేష్‌: ప్రపంచ రంగస్థల దినోత్సవం అంటే ఇందులో నటీనటులందరికీ భాగస్వామ్యం వుంది. నేను స్థాపించిన కళాకారుల ఐక్యవేదికలో దేశవ్యాప్తంగా 18,000 మంది సభ్యులు వున్నారు. ఐక్యవేదిక ఎందుకు స్థాపించాల్సి వచ్చిందంటే ఒక గొప్ప రంగస్థల నటుడు చనిపోతే ఆయన భార్య అంట్లు తోముకుంటూ కనిపించింది. కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆరోజు ఆమెకు కొంత డొనేషన్‌ ఇప్పించి ఈ నిర్ణయం తీసుకున్నాను. రంగస్థలం బ్రతికితే అన్ని కళలూ బ్రతుకుతాయి. ప్రతి సంవత్సరం రంగస్థల దినోత్సవాన్ని నేను అనంతపురంలో జరుపుకుంటాను. ఈ సంవత్సరం పెద్దలు పరుచూరి వెంకటేశ్వరరావుగారు నేతృత్వంలో సినీ, టి.వి. కళాకారులతో ఇక్కడ ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నాను. రామానాయుడుగారు ఇక్కడ నాటకాలు జరిపించండి అని వెంకటేశ్వరరావుగారిని కోరారు. కాబట్టి మేమంతా కళాకారులుగా ఆయన వెంట వుండి అన్నివిధాలా సహకరిస్తామని తెలియజేస్తున్నాను.

శివపార్వతి: ఈరోజును ప్రతి కళాకారుడూ గుర్తుంచుకోవాల్సిన రోజు. ఎంతటి కళాకారుడైనా నాటక రంగంలోనే ఓనమాలు దిద్దుకొని, అక్కడే భాష నేర్చుకొని సినిమా రంగానికి వచ్చిన దాఖలాలు ఎన్నో వున్నాయి.  రామానాయుడుగారు సినిమా ప్రొడ్యూసర్‌ అయినప్పటికీ నాటక రంగం మీద ఎంతో అభిమానం చూపించేవారు. పరుచూరి రఘుబాబు కళాపరిషత్‌ నుంచి చాలా మంది కళాకారులను సినిమా రంగానికి పరిచయం చేశారు. రామానాయుడుగారి పేరు మీద వున్న ఈ కళ్యాణ మండపాన్ని వినియోగించుకోవడం లేదు కాబట్టి మా గురువుగారు వెంకటేశ్వరరావుగారు మళ్ళీ ఈ మండపానికి కళను తీసుకొస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది. 

కొండవలస: సినిమా నటీనటులు రంగస్థలాన్ని విడిచి పెట్టేశారని అందరూ అనుకుంటున్నారు. అలా జరగకూడదనే ముందు చూపుతో రామానాయుడుగారు ఈ కళ్యాణమండపాన్ని కట్టించారు. దీన్ని మనం సవ్యంగా ఉపయోగించుకోవడం లేదు. దానికి ఒక అంకురార్పణ జరగాలి. అది మా గురువుగారు వెంకటేశ్వరరావుగారి చేతులమీదుగానే జరుగుతున్నందుకు ఆనందంగా వుంది. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement