Advertisement

తాత్కాలిక రాజధానికే అంత ఖర్చు చేస్తున్నారా..??


పూర్తి స్థాయిలో రాజధాని అభివృద్ధి చేసేవరకు గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద తాతాల్కికంగా రాజధాని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ఇందుకోసం దాదాపు రూ. 100 కోట్లు ఖర్చుపెట్టి ఐదు భవనాలను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈ పనులను సత్యవాణి సంస్థ దక్కించుకుంది. అయితే ఇక్కడా పనులు ఇంకా ప్రారంభంకాకముందే అంచనావ్యయం డబుల్‌  అయ్యింది. ప్రస్తుతం ఇక్కడ ఐదు భవనాలను నిర్మించి ఇవ్వడానికి రూ. 200 కోట్లు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. తాత్కాలింగా పాలన సాగించడానికి నిర్మిస్తున్న భవనాల అంచనా వ్యయమే నెలల వ్యవధిలో రెట్టింపు అయితే ఇక పూర్తి స్థాయి రాజధాని నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో, దశాబ్దాలపాటుసాగే రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేసే వరకు వ్యయం ఎన్ని రేట్లవుతుందో ఊహించవచ్చు. ఇక తాత్కాలిక రాజధాని విషయానికొస్తే.. మూడు నెలల్లోగా లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం చొప్పున ఈ ఐదు భవనాలను నిర్మించనున్నారు. జూన్‌లోగా ఈ ఐదు భవనాలు ప్రభుత్వానికి అందుబాటులోకి  వస్తాయని  అంచనా.

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement