Advertisement

'సాక్షి'పై ఆంక్షలు విధిస్తారా..??


గతంలో వైఎస్‌ఆర్‌ హయాంలో పత్రికలపై ప్రభుత్వం చర్యలకు దిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తుందంటూ ఏకంగా నెలపాటు ఆంధ్రజ్యోతి పత్రికకు ప్రకటనలు నిలిపివేసి చర్యలు తీసకునాన్నారు. ఆ సమయంలో ఆ పత్రికకు అండగా టీడీపీ, కమ్యూనిస్ట్‌ పార్టీలు ఆందోళనకు దిగాయి. మీడియా స్వేచ్ఛను వైఎస్‌ఆర్‌ దెబ్బతీస్తున్నారంటూ ఆరోపించాయి. అయితే అదే టీడీపీ ప్రభుత్వం 'సాక్షి' పత్రికపై పలు ఆంక్షాలను విధించడానికి వెనుకాడటం లేదు. టీడీపీ పార్టీ సమావేశాలకు 'సాక్షి' ప్రతినిధులకు ఆహ్వానం అందదు. అక్కడకు వచ్చినా వారిని లోనికి రానియ్యరు. అంతేకాకుండా 'సాక్షి'కి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రకటనలు పూర్తిగా నిలిపివేయాలని టీడీపీ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు గాలి ముద్దుకృష్ణమనాయుడు విలేకరులతో మాట్లాడుతూ.. సంక్రాంతి పథకంపై సాక్షి పత్రిక దుష్ప్రచారం చేసిందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆరోపించారు. అంతేకాకుండా ఆ పత్రికకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రకటనలు కూడా నిలిపివేయాలని డిమాండ్‌  చేశారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నుంచి సాక్షి పత్రికకు చాలా తక్కువగా ప్రకటనలు వస్తున్నాయి. ఇక కేంద్రం నుంచి కూడా పూర్తిగా ప్రకటనలు నిలిపివేసి జగన్‌ను దెబ్బతియ్యాలని టీడీపీ నాయకులు యోచిస్తుననట్లు కనిపిస్తోంది.

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement