Advertisement

కేసీఆర్‌ చెప్పినట్టు జరిగితే అవినీతికి చెక్‌ పడినట్లే..!


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరంగల్‌ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. వరంగల్‌ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని, అక్కడి సమస్యలన్ని పరిష్కరిస్తానని కూడా చెబుతున్నాడు. అంతేకాకుండా వరంగల్‌ పట్టణంలోని స్లమ్‌ ఏరియాల్లో కూడా పర్యటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇక ఇప్పుడు అవినీతి భరతం పడతానంటూ కొత్త ప్రకటన ఇచ్చేశాడు. తన ప్రభుత్వంలో అవినీతికి తావు లేదని, ఎవరైనా లంచాలు అడిగితే తనకు ఫిర్యాదు చేయాలంటూ చెప్పాడు. ఇలా చెప్పడమే కాకుండా ఏకంగా 23454071 అనే టోల్‌ ఫ్రీ నంబర్‌ను ప్రకటించి అవినీతిపై ఫిర్యాదు చేయాలని సూచించాడు. అయితే ఈ నంబర్‌కు ఫోన్‌ చేసిన తర్వాత ఫిర్యాదు ఎవరు తీసుకుంటారో.. ఎవరు దర్యాప్తు చేపడుతారో అనే విషయాలపై ఇంకా స్పష్టతరావాల్సి ఉంది. ఇక కేసీఆర్‌ చెప్పిన మాదిరిగానే ఈ నంబర్‌కు ఫిర్యాదు చేయగానే తగినంత స్పందన లభిస్తే రాష్ట్రంలో అవినీతిని అరికట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement