బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నటించిన సంచలన చిత్రం `ధురంధర్` మొదటి భాగం అంతర్జాతీయ స్థాయిలో మరో మైలురాయిని చేరుకోవడానికి సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ జులై 10న జపాన్ ప్రేక్షకులను పలకరించబోతోంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థలైన జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ అధికారికంగా ప్రకటిస్తూ జపనీస్ భాషలో ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశాయి.
ఇప్పటికే స్వదేశీ గడ్డపై సత్తా చాటిన చిత్రం ఇప్పుడు జపాన్‌లో ధురంధర్ ఎనర్జీని ప్రదర్శించేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. గత ఏడాది డిసెంబర్ 5న విడుదలైన మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద 1328 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి భారతీయ సినిమా గర్వించదగ్గ విజయంగా నిలిచింది. నార్త్ అమెరికాలో ఆల్ టైమ్ నంబర్ వన్ హిందీ చిత్రంగా నిలవడమే కాక కెనడా, ఆస్ట్రేలియా మార్కెట్లలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా చరిత్ర సృష్టించింది.
ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అండర్‌కవర్ ఏజెంట్ సాహసోపేతమైన కథను వాస్తవిక భౌగోళిక, రాజకీయ సంఘటనల నేపథ్యంలో అద్భుతంగా ఆవిష్కరించింది. ఈ భారీ మల్టీస్టారర్ చిత్రంలో రణ్‌వీర్ సింగ్‌తో పాటు అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ , ఆర్. మాధవన్ వంటి దిగ్గజ నటులు నటించడం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రెండు భాగాలుగా రిలీజ్ అయిన ధురంధర్ మొదటి భాగం జపాన్ లో ఆసల్యంగానే రిలీజ్ అవుతుంది. అక్కడ రిజల్ట్ ను బట్టి ధురంధర్ రెండవ భాగాన్ని రిలీజ్ చేయాలా? లేదా? అన్నది మేకర్స్ డిసైడ్ చేస్తారు.