Advertisement
Google Ads BL

తొలి హిట్ తో స‌వాల్‌గా మారిన రెండో సినిమా


టాలీవుడ్‌లో తొలి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న యువ దర్శకులు ప్రస్తుతం రెండో సినిమాను పట్టాలెక్కించి విడుదల చేయడానికి ఏళ్ల తరబడి వేచి చూడాల్సి రావడం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. `ఉప్పెన` వంటి ఘన విజయంతో మెప్పించిన బుచ్చిబాబు సానా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో `పెద్ది` సినిమాను తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే సినిమా రిలీజ్ అవ్వాలి. కానీ షూటింగ్ ఆల‌స్యం స‌హా సాంకేతిక కారణాల వ‌ల్ల  జాప్యం జరుగుతోంది.

Advertisement
CJ Advs

తాజాగా  చిత్రాన్ని జూన్ 25న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో `బింబిసార`తో సత్తా చాటిన వశిష్ట మెగాస్టార్ చిరంజీవితో `విశ్వంభర`ను పూర్తి చేసినా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా విడుదల తేదీపై ఇంకా స్పష్టత రాని సంగ‌తి తెలిసిందే. దీంతో వ‌శిష్ట‌ మూడేళ్లుగా ఒకే ప్రాజెక్టుపై సమయాన్ని వెచ్చించాల్సి వస్తోంది. అలాగే  `దసరా` చిత్రంతో రా అండ్ రస్టిక్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న శ్రీకాంత్ ఓదెల సైతం రెండో సినిమా విషయంలో ఏమాత్రం తొందర పడటం లేదు.

నాని హీరోగా తెర‌కెక్కిస్తోన్న `ది పారడైజ్` మార్చిలో విడుదల కావాల్సి ఉన్నా మేకింగ్‌లో రాజీ పడకూడదనే ఉద్దేశంతో షూటింగ్‌ను నిదానంగా కొనసాగిస్తున్నారు. భారీ లక్ష్యాలు, పాన్ ఇండియా అంచనాల నేపథ్యంలో ప్రతి అడుగూ ఆచితూచి వేయడం వల్లే మేకింగ్ సమయం  పెరుగుతోంది. ఈ మొత్తం సీన్ చూస్తే? స్టార్ హీరోల కాల్‌షీట్లు దొరకడం ఒక ఎత్తయితే? వారు అనుకున్న విజన్ తెరపైకి వచ్చే వరకు రాజీ పడకపోవడం  దర్శకులకు అనివార్యంగా మారింది.

తొలి సినిమాతో పెంచేసిన అంచనాలను అందుకోవాలనే ఒత్తిడి, స్టార్ హీరోల డేట్ల కోసం నిరీక్షణ యువ దర్శకుల వేగాన్ని తగ్గిస్తున్నాయి. ప్రతిభ ఉన్న దర్శకులకు అవకాశాలు క్యూ క‌డుతున్నా? సరైన సమయంలో సినిమాలు విడుదల కాకపోవడం వల్ల కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఏడాదికి ఒక సినిమా తీసే సత్తా ఉన్నా, పాన్ ఇండియా రేంజ్ అంచనాల వల్ల ఒక్కో ప్రాజెక్టుకు రెండు మూడు ఏళ్లు వెయిట్ చేయడం   కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. 

Debut Film Hit What About second:

Debut Film Hit why delay in second film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs