Advertisement
Google Ads BL

రాకాలో ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్‌తో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోన్న AA


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్ట‌ర్ అట్లీ కాంబోలో రూపొందుతోన్న భారీ చిత్రం రాకా. రీసెంట్‌గా ఈ ప్రెస్టీజియ‌స్‌ ప్రాజెక్ట్ నుంచి వ‌చ్చిన అప్‌డేట్‌ భారతదేశ‌మంత‌టా ప్రేక్ష‌కుల‌తో పాటు సినీ వ‌ర్గాల్లోనూ భారీ ఆసక్తిని రేకెత్తించింది. దేశంలో అత్యంత పేరు సంపాదించిన‌, క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌ఫుల్ స్టార్స్‌లో కరైన అల్లు అర్జున్‌తో, భారీ చిత్రాల‌ను లార్జ్ స్కేల్‌లో రూపొందించే ఫిల్మ్ మేక‌ర్ అట్లీ కాంబోలో రూపొందుతోన్న రాకా సినిమాను భారతీయ సినిమా చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే సరిహద్దులను దాటి కొత్త స్థాయికి తీసుకెళ్లే విజువ‌ల్ ఎక్స్‌పీరియెన్స్‌డ్ మూవీగా నిలవబోతుందని చర్చ జరుగుతోంది.

Advertisement
CJ Advs

ప్ర‌స్తుతం ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో అల్లు అర్జున్ అంత్యంత ప్ర‌భావంత‌మైన‌, డైన‌మిక్ స్టార్‌. ఆయ‌నకు సంబంధించిన ప్ర‌తి విష‌యానికి ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌స్తోంది. అందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ రాకా. ఈ సినిమాలో ఆయ‌న కొత్త లుక్ ఆన్‌లైన్‌లో సంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఆయ‌న చేతితో చూపిస్తోన్నస్టైల్ వైర‌ల్ అయ్యింది. ఇప్పుడు చాలా మంది దాన్ని అనుస‌రిస్తున్నారు. ఇటీవ‌ల ఇండియ‌న్ స్టార్ క్రికెట‌ర్ హార్దిక పాండ్య కూడా ఓ ఐపీఎస్ మ్యాచ్ స‌మ‌యంలో ఆ స్టైల్‌ను రీ క్రియేట్ చేయ‌టం విశేషం. ఈ లుక్, దాని ఇంటెన్సిటీ కోసం అల్లు అర్జున్ ఎంత‌గానో శ్ర‌మించారు.

రెండు ద‌శాబ్దాల‌కు పైగా కొన‌సాగుతోన్న అల్లు అర్జున్ కెరీర్‌ను గ‌మ‌నిస్తే, ఆయ‌న ఎప్ప‌టిక‌ప్పుడు త‌న స్టైల్‌, న‌ట‌న, మాస్ అప్పీల్‌ను మార్చుకుంటూ వాటికి కొత్త నిర్వ‌చ‌నాల‌ను చెబుతూ ముందుకు సాగుతున్నారు. ట్రెండ్ సెట్ట‌ర్‌గా ఆయ‌నుకున్న పేరు, ఆయ‌న రోల్స్ కోసం అంకిత భావంతో ప‌డుతోన్న శ్ర‌మ‌ను చూస్తే ఈ వాద‌న మ‌రింత‌గా బ‌ల‌ప‌డుతోంది. ముఖ్యంగా రీసెంట్‌గా రిలీజైన రాకా లుక్ కోసం అల్లు అర్జున్ ప్ర‌తీ రోజూ మూడు నుంచి నాలుగు గంట‌ల పాటు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. ఈ స్థాయి క్ర‌మ‌శిక్ష‌ణ‌, చిన్న చిన్న విష‌యాల‌పై ఆయ‌న చూపుతోన్న శ్ర‌ద్ధ చూస్తే ప్ర‌తీ స‌న్నివేశంలో స‌హ‌జ‌త్వం, ప‌రిపూర్ణ‌త సాధించాల‌నే ఆయ‌న త‌ప‌న స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

పుష్ప సినిమా సాధించిన అపూర్వ‌మైన విజ‌యం త‌ర్వాత అల్లు అర్జున్ త‌న సినిమాల‌కు సంబంధించిన కొత్త లుక్స్‌పై ప్ర‌యోగాలు చేయ‌టం, ఇంటెన్స్ ఉన్న పాత్ర‌ల‌ను చేయ‌టానికి సిద్ధ‌ప‌డ‌టం, రొటీన్‌కు భిన్నంగా ఉండే క్రియేట్ నిర్ణ‌యాలు తీసుకోవటం ద్వారా ఈ అంచ‌నాల‌ను మ‌రింత‌గా పెంచుతున్నారు. ఇది ఆయ‌న‌కు ప్రేక్ష‌కుల‌పై ఉన్న గౌర‌వాన్ని చూపిస్తోంది. లుక్‌, స్టైల్‌, స్వాగ్ ద్వారా ఆయ‌న ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌త్యేక‌మైన అనుభ‌వాన్ని ప్రేక్ష‌కుల‌కు అందిస్తూ నిజమైన ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలుస్తున్నారు అల్లు అర్జున్‌. ప్ర‌తీ పాత్ర‌తో త‌న‌ను తాను కొత్త‌గా మ‌లుచుకోవాల‌నే ఆయ‌న నిబ‌ద్ధ‌త, ఆయ‌న స్క్రీన్ ప్రెజెన్స్‌లో స్ప‌ష్టంగా తెలుస్తోంది.

ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో అత్యంత భారీ విజ‌యాన్ని సాధించిన త‌ర్వాత కూడా అల్లు అర్జున్ ధైర్యంగా త‌న‌ని తాను స‌వాలు చేసుకునే రిస్క్‌తో కూడా విభిన్న‌మైన పాత్ర‌ల‌ను ఎంచుకోవ‌టానికి నిరంత‌రం ప్ర‌య‌త్నిస్తున్నారు. రాకా సినిమాతో ఆయ‌న చేస్తోన్న ఇత‌ర ప్రాజెక్టుల‌పై కూడా ఆస‌క్తి పెరుగుతోంది. ఆయ‌న సినిమాలు రూపొందుతోన్న భారీ స్కేల్, నైపుణ్యం, పాపులారిటీ అన్నీ చూస్తే ఇది త‌న‌ కెరీర్‌లో కీల‌క‌మైన ద‌శ‌గా అభివ‌ర్ణించ‌వ‌చ్చు. అద్భుత‌మైన న‌ట‌న‌, డాన్స్‌, స్క్రీన్ ప్రెజెన్స్‌, మాస్ అప్పీల్ ఇలా అన్నింటినీ స‌మ‌న్వ‌యం చేస్తోన్న ఆయ‌న సామ‌ర్థ్యం ఆయ‌న్నొక సంపూర్ణ న‌టుడిగా ప్ర‌త్యేకంగా నిల‌బెడుతోంది.

Allu Arjun Raaka Transformation Stuns:

3–4 Hours Daily Prep - Allu Arjun’s Raaka Transformation Stuns
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs