Advertisement
Google Ads BL

అమరావతి రైతుల విజయం - బాలయ్య


ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒక చారిత్రాత్మక విజయ క్షణం.

Advertisement
CJ Advs

కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసి, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గారి ఆమోదంతో అమరావతిని ఏకైక రాజధానిగా అధికారికంగా ప్రకటించింది. 

ఇది మన రైతుల త్యాగానికి, ప్రజల ఆశలకు, భవిష్యత్తు తరాల కలలకు లభించిన న్యాయం.

అమరావతి ఇప్పుడు కేవలం ఒక నగరం కాదు – మన ఆత్మగౌరవానికి, మన భవిష్యత్తుకు ప్రతీక.

ఈ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా – రాజధాని చిరకాల స్వప్నాన్ని సాకారం చేయడంలో సహకరించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గారికి, ప్రధాని నరేంద్ర మోదీ గారికి, హోంమంత్రి అమిత్ షా గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఈ బిల్లుకు మద్దతు తెలిపిన అన్ని పార్టీలకు, పార్లమెంట్ సభ్యులందరికీ, మా వెన్నంటి నిలిచిన ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం ముఖ్యంగా అమరావతి రైతుల విజయం.

వారి సహనం, త్యాగం, నిబద్ధతే ఈ చారిత్రాత్మక క్షణానికి పునాది. వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ఈ చట్టబద్ధతతో పెట్టుబడిదారులకు భరోసా కలుగుతుంది. అమరావతి అజేయంగా, అజరామరంగా వెలుగొందుతుంది. మనందరం కలసి అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుదాం.

జై ఆంధ్రప్రదేశ్ – జై అమరావతి!

మీ నందమూరి బాలకృష్ణ

Nandamuri Balakrishna:

Nandamuri Balakrishna - Amaravathi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs