Advertisement
Google Ads BL

పీఎం మోడీకి నారా లోకేష్ థాంక్స్


ఆంధ్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు లోక్‌సభలో భారీ మెజారిటీతో ఆమోదం పొందడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. ఇంతటి అద్భుతమైన విజయం సాధించిన తరుణంలో, రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి థాంక్స్ చెప్పేందుకు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. 

Advertisement
CJ Advs

ఢిల్లీ లో నారా లోకేష్-మోడీ భేటీ ఒక ప్రత్యేక ఆకర్షణ నిలిచింది. తనను గెలిపించిన రాజధాని ప్రాంతంలోని మంగళగిరి నియోజకవర్గ నేతన్నల నైపుణ్యానికి ప్రతీకగా, అత్యంత నైపుణ్యంతో నేసిన మంగళగిరి చేనేత శాలువాతో ప్రధాని మోదీని లోకేష్ ఘనంగా సత్కరించారు. మన సంస్కృతిని, హస్తకళను దేశ రాజధాని నడిబొడ్డున గౌరవించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.

ఏపీ అసెంబ్లీ పంపిన తీర్మానంపై లోక్‌సభలో చర్చ జరిగింది. దేశంలోని అన్ని పార్టీలను అమరావతి వైపు నిలిపి, బిల్లుకు చట్టబద్ధత వచ్చేలా చేసిన ప్రధాని వ్యూహాన్ని లోకేష్ కొనియాడారు. 

ఇచ్చిన మాటకు కట్టుబడి, కేంద్ర ప్రభుత్వం అమరావతికి అండగా నిలిచింది అని లోకేష్ ఈ సందర్భంగా ప్రశంసించాఋ. అమరావతి అంటే కేవలం ఒక నగరం కాదు, అది ఆంధ్రుల ఆత్మగౌరవం. ఆ ఆత్మగౌరవానికి పట్టాభిషేకం చేసిన ప్రధానికి ధన్యవాదాలు.. అంటూ నారా లోకేష్ తెలిపారు. 

Nara Lokesh meets PM Modi:

Nara Lokesh meets PM Modi, thanks him for passing Amaravati Bill
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs