Advertisement
Google Ads BL

వాళ్ల‌క‌న్నా మ‌నోళ్లే బెట‌ర్ క‌దా


 

Advertisement
CJ Advs

 

`ధురందర్ 2` సృష్టిస్తున్న వసూళ్ల ప్రభంజనం ఒక చరిత్రగా మారుతోంది. ఇప్పటికే 1000 కోట్ల క్లబ్‌లో చేరింది. 2000 కోట్ల క్ల‌బ్ లోనూ చేరుతుంద‌నే అంచ‌నాలున్నాయి. ఇంతటి భారీ విజయం నమోదైనా హిందీ పరిశ్రమలోని అగ్ర తారలైన ఖాన్‌లు, కపూర్‌లు సోషల్ మీడియా వేదికగా కూడా స్పందించకపోవడం గమనార్హం. రణవీర్ సింగ్ వంటి ఎనర్జిటిక్ స్టార్ సాధించిన ఈ ఘనతను అభినందించకుండా బాలీవుడ్ పెద్దలు మౌనం వహించడం వెనుక అంతర్గత రాజకీయాలు , అభద్రతా భావం ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

బాలీవుడ్‌లో కనిపిస్తున్న ఈ సైలెంట్ పాలిటిక్స్ కు భిన్నంగా టాలీవుడ్‌లో ఒక ఆరోగ్యకరమైన వాతావరణం కనిపిస్తోంది. తెలుగు పరిశ్రమలో హీరోల మధ్య బాక్సాఫీస్ పోటీ ఉన్నప్పటికీ ఒక సినిమా హిట్ అయితే చిరంజీవి, మహేష్, ఎన్టీఆర్, చరణ్, బన్నీ, ప్రభాస్ వంటి అగ్ర తారలు మనస్ఫూర్తిగా అభినందిస్తుంటారు. చిన్న సినిమాలను కూడా ఇంటికి పిలిచి మరీ అభినందించే గొప్ప సంస్కృతి టాలీవుడ్ సొంతం. ఈ సమష్టి కృషి , ఒకరి ఎదుగుదలను మరొకరు ప్రోత్సహించే గుణమే  టాలీవుడ్ ను మిగ‌తా ప‌రిశ్ర‌మ‌ల నుంచి వేరు చేస్తుంది.

 

ధురంధ‌ర్ 2కి సొంత పరిశ్రమ నుండి మద్దతు కరువైనప్పటికీ తెలుగు మీడియా , ఇతర పరిశ్రమలు  విజయాన్ని గొప్పగా సెలబ్రేట్ చేస్తున్నాయి. సినిమా అనేది ఒక కళ . దాన్ని ఎవరు పండించినా అభినందించడం కనీస ధర్మమని నెటిజన్లు బాలీవుడ్ స్టార్లను విమర్శిస్తున్నారు. కేవలం ఈగోల కోసం రణవీర్ సింగ్ కష్టాన్ని గుర్తించ కపోవడం బాలీవుడ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తోందని చర్చ జరుగుతోంది. టాలీవుడ్ తరహాలో అందరూ ఒకే తాటిపైకి వచ్చి సక్సెస్‌ను పంచుకుంటేనే పరిశ్రమ మరింత బలోపేతం అవుతుందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

Bollywood Silent On Dhurandhar 2 Success:

<p class="MsoNormal">Dhurandhar 2 Success - Bollywood Silent Tollywood Responds
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs