Advertisement
Google Ads BL

పవన్ కి ఉస్తాద్ నష్టం ఎంతంటే


పాపం పవన్ కళ్యాణ్.. రాజకీయాల కోసం సినిమాలు చేస్తున్నాను, సినిమాల్లో వచ్చే డబ్బు రాజకీయాలకు ఉపయోగిస్తున్నాను అని.. నిర్మాతల నుంచి అడ్వాన్స్ లు తీసుకుని ఏళ్ళ తరబడి సినిమాలను సెట్ పై ఉంచి అటు నిర్మాతలకే కాదు ఇటు తనకు లాస్ వచ్చినా పవన్ మాత్రం సినిమాలు ఆపలేదు. ఒకేసారి మూడు సినిమాలను పట్టాలెక్కించిన పవన్ తర్వాత డిప్యూటీ సీఎం అయ్యాక వాటిని మూడు నాలుగేళ్ళకు పూర్తి చేసారు.

Advertisement
CJ Advs

హరి హర వీరమల్లు, OG, ఉస్తాద్ భగత్ సింగ్.. మూడు సినిమాలపై విపరీతమైన హైప్. వీరమల్లు డిజాస్టర్, OG ఓకే ఓకే. ఉస్తాద్ భగత్ సింగ్ రిజల్ట్ ఏమిటో మీకు తెలుసు. మార్చ్ 19 న విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ రెస్పాన్స్ తో ఎదురీదుతోంది. అయితే ఉస్తాద్ తో నిర్మాతలకు ఎంత లాస్ వస్తుందో తెలియదు కానీ పవన్ కి మాత్రం భారీ లాస్ అనే చెప్పాలి.

ఆయన హీరో కదా ఆయనకేం పోయింది అనుకుంటున్నారేమో.. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కి చాలా తక్కువ మొత్తంలో అడ్వాన్స్ తీసుకుని అసలు  రెమ్యునరేషన్ తీసుకోలేదని ఆ సినిమా నిర్మాతే ఉస్తాద్ ప్రమోషన్స్ లో చెప్పారు.

మరి ఉస్తాద్ కలెక్షన్స్ చూస్తే నిర్మాతలు ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. ఇంక పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఏం తీసుకుంటారు. నిర్మాతల కోసం ఆయన త్యాగం చెయ్యాల్సిందే. ఇలా అయితే కష్టమే కదా.. ఉస్తాద్ తో పవన్ కి భారీ లాస్ తప్ప ఇంకేం మిగల్లేదు. అటు ఆయన మర్కెట్ విషయంలోనూ విస్తృతమైన చర్చ ఇండస్ట్రీలో మొదలైపోయింది. 

Ustaad Bhagat Singh A Big Lesson For Pawan Kalyan:

Ustaad Bhagat Singh Wakeup Call For Pawan Kalyan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs