పెద్ది అప్ డేట్ వల్ల శ్రీరామనవమికి మెగాస్టార్ చిరంజీవి-వసిష్ఠ ల విశ్వంభర అప్ డేట్ ఇవ్వలేకయారంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. లేదంటే విశ్వంభర అప్డేట్ ఇచ్చేవారా.. మరదేదో మెగా ఫ్యాన్స్ కి అర్ధమయ్యేలా చెప్పొచ్చుగా. విశ్వంభర ట్రైలర్ కట్ చేస్తున్నారు. విశ్వంభర వి ఎఫ్ ఎక్స్ ఎపిసోడ్స్ అదిరిపోతున్నాయి.
అందులోని బెస్ట్ అనుకున్న సీన్స్ తో విశ్వంభర ట్రైలర్ కట్ ఉండబోతుంది. విశ్వంభర ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతాయని అన్నారు. మరి ఏప్రిల్ 2న హనుమజ్జయంతి. ఆ రోజు ఏమైనా విశ్వంభర అప్ డేట్ సిద్ధం చేస్తున్నారా. మెగాస్టార్ ఇష్ట దైవం హనుమంతుడు. ఏప్రిల్ 2 న హనుమజ్జయంతి.
ఆ రోజు గనక విశ్వంభర నుంచి అప్ డేట్ వస్తే మెగా ఫ్యాన్స్ కూడా సెంటిమెంట్ గా ఫీలవుతారు. మరి విశ్వంభర నుంచి రిలీజ్ డేట్ కావాలని మెగా ఫ్యాన్స్ ఆశించినా మేకర్స్ ఎందుకో పట్టించుకోవడమే లేదు. ఆ తరుణం ఏప్రిల్ 2 న వస్తుందేమో చూడాలి.