పుష్ప చిత్రం లాంటి తెలుగు స్ట్రయిట్ సినిమాలో నటించి టాలీవుడ్ ప్రేక్షకుల్లో క్రేజ్ సంపాదించిన మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాసిల్. పుష్ప తర్వాత ఆయనకు టాలీవుడ్ ఆఫర్స్ రాలేదా? వచ్చినా ఆయన వద్దనుకున్నారా? అనే విషయంలో చాలామందిలో చాలా అనుమానాలున్నాయి.
అసలు ఫాహద్ ఫాసిల్ అనిల్ రావిపూడి-వెంకటేష్ కలయికలో తెరకెక్కే మూవీలో నటించాల్సి ఉండగా.. ఫహద్ ఫాసిల్ ఎక్కువ పారితోషికం డిమాండ్ చేయడంతోనే ఫహద్ ని కాదని అనిల్ రావిపూడి కళ్యాణ్ రామ్ ని ఎంచుకున్నాడనే టాక్ ఉండనే ఉంది. ఇప్పుడు అదే నిజమంటున్నారు.
పుష్ప తర్వాత టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఫహద్ ఫాసిల్ కోసం ప్రత్యేకమైన పాత్రలు రాసుకుని ఆయన్ని ఒప్పించాలని వెళ్ళగా.. ఫహద్ ఫాసిల్ మాత్రం ఒక్కో సినిమాకు రూ.15 నుంచి రూ.20 కోట్ల పారితోషికం డిమాండ్ చెయ్యడంతో నిర్మాతలు ఆ పారితోషికానికి భయపడే వెనుకంజ వేస్తున్నారట.
సో ఫహద్ ఫాసిల్ లాంటి టాలెంట్ ఉన్న నటుడిని మనం మిస్ అవుతున్నది మన దర్శకనిర్మాతల వల్ల కాదు, ఫహద్ ఫాసిల్ మొండితనం వల్లన్నమాట.