మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది చిత్రం ఏప్రిల్ 30న రిలీజ్ కానున్న నేపథ్యంలో లెనిన్ టీం ఓ నిర్ణయాన్ని తీసుకుంది. రామ్ చరణ్‌తో ఉన్న అఖిల్ అక్కినేనికి, టీంకు ఉన్న బాండింగ్ కారణంగా సహృదయంతో ‘లెనిన్’ సినిమాని వాయిదా వేశారు. మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉన్న లెనిన్ చిత్రాన్ని జూన్ 26న విడుదల చేయనున్నారు.
ఏప్రిల్ 30న విడుదల కానున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది కోసమే లెనిన్ మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. పరస్పర గౌరవంతో పాటుగా, ఎక్కువ సంఖ్యలో థియేటర్ల లభ్యత, సానుకూల వాతావరణాన్ని కల్పించేందుకు, లెనిన్ బృందం విడుదలను వాయిదా వేసింది.
రామ్ చరణ్, అఖిల్ అక్కినేనిల మధ్య ఉన్న ఆత్మీయ బంధం గురించి అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని నిర్మాతలు చెబుతూ ఈ నిర్ణయం పరిశ్రమలో సద్భావనను, ఐక్యతా స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని అన్నారు.
లెనిన్ మూవీని మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్నారు. బలమైన భావోద్వేగాలు, ఆకట్టుకునే కథనంతో ఒక కంప్లీట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ అందించేలా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాని అత్యుత్తమ రూపంలో అందించి, ప్రేక్షకులకు చిరస్మరణీయమైన సిల్వర్ స్క్రీన్ ఎక్స్‌పీరియెన్స్‌ను కలిగిస్తామని చిత్ర బృందం హామీ ఇస్తోంది.
ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ఆయన్ మ్యూజిక్, ఆర్ఆర్ సినిమా స్థాయిని పెంచేలా ఉంటుందని సమాచారం. లెనిన్ కోసం వెయిట్ చేస్తున్న, సపోర్ట్ చేస్తున్న ప్రతీ ఒక్క ప్రేక్షకుడికి మేకర్స్ కృతజ్ఞతలు తెలిపారు.