Advertisement
Google Ads BL

పెద్ది ర్యాంపేజ్ గేమ్ గ్లింప్స్


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  పాన్-ఇండియా యాక్షన్ డ్రామా పెద్ది. పెద్ది ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే సంచలనం క్రియేట్ చేస్తోంది. పెద్ది ఫస్ట్ షాట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

Advertisement
CJ Advs

ఎఆర్ రెహమాన్ అందించిన సౌండ్‌ట్రాక్స్ మెగా చార్ట్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. చికిరి చికిరి,  రైరై రా రా పాటలు వరల్డ్ వైడ్ వైరల్ అయ్యాయి.

తాజాగా మేకర్స్ మరో బిగ్ అప్డేట్ ఇచ్చారు. పెద్ది గేమ్ గ్లింప్స్ మార్చి 27 ఉదయం 11 గంటల 7 నిమిషాలకు రిలీజ్ కానుంది. ఈ గ్లింప్స్ మాస్ ర్యాంపేజ్ గా ఉండబోతుంది. అలాగే పెద్ది సినిమా సెట్స్‌లో రామ్‌చరణ్‌ గాయపడ్డారన్న వార్తలపై టీమ్‌ స్పందించింది.  

పెద్ది సినిమా సెట్స్‌లో  నిన్న జరిగిన చిన్న ఘటన గురించి వచ్చిన వార్తలపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాం. రామ్ చరణ్ గారు పూర్తిగా క్షేమంగా ఉన్నారు. షూటింగ్ సమయంలో ఎడమ కంటికి చిన్న గాయం కావడంతో ఒక చిన్న ప్రొసీజర్ చేశారు.

ఆయన రేపటినుంచి తిరిగి షూటింగ్‌లో పాల్గొంటారు. షూటింగ్ షెడ్యూల్‌కు ఎలాంటి అంతరాయం లేదు. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అన్నీ కంట్రోల్ వున్నాయి ఉన్నాయి. సినిమా పనులు సజావుగా కొనసాగుతున్నాయి. – టీమ్ పెద్ది

Peddi Update:

Ram Charan Peddi Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs