Advertisement
Google Ads BL

పవన్ తదుపరి సినిమాపై క్లారిటీ


ఉస్తాద్ భగత్ సింగ్ తో ప్రేక్షకులను అలరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో రాజకీయాలతో బిజీ అయ్యారు. ఉస్తాద్ తర్వాత పవన్ తన తదుపరి మూవీ సెట్ లోకి ఎప్పుడు వెళతారు, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కమిట్ అయిన మూవీ సెట్ లోకి పవన్ ఎప్పుడు వస్తారనే విషయంలో రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి.

Advertisement
CJ Advs

పవన్ తదుపరి సినిమాలపై వస్తున్న రకరకాల వార్తలకు PK క్రియేటివ్ వర్క్స్ అధికారికంగా చెక్ పెట్టింది. ప్రస్తుతం ఆయన ఎలాంటి కొత్త ప్రాజెక్టులకు కమిట్ అవ్వలేదని.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని సోషల్ మీడియా లో ఒక ట్వీట్ వేశారు. రాజకీయ బాధ్యతలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. ప్రస్తుతానికి కొత్త సినిమాల షూటింగ్స్ ప్రారంభించే ఆలోచనలో లేరని తెలుస్తుంది.

అంతేకాకుండా ఏదైనా కొత్త అప్‌డేట్ ఉంటే కేవలం అధికారిక ఛానల్స్ ద్వారా మాత్రమే తెలియజేస్తామని PK క్రియేటివ్ వర్క్స్ టీమ్ క్లారిటీ ఇచ్చారు. పనిలో పనిగా ఓజీ 2 గురించి వస్తున్న రూమర్లపై కూడా టీమ్ స్పందించింది. దీనికి సంబంధించిన ఏ చిన్న అప్‌డేట్ అయినా స్వయంగా పవన్ కళ్యాణ్ సరైన సమయంలో వెల్లడిస్తారని పేర్కొన్నారు. అప్పటి వరకు ఊహాగానాలను నమ్మవద్దని.. అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. 

PK Creative Works :

Pawan Kalyan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs