పాన్-ఇండియా సెంటిమెంట్ & సీక్వెల్స్
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం సీక్వెల్స్ ట్రెండ్ బాక్సాఫీస్‌ను శాసిస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.`బాహుబలి 2`, `కేజీఎఫ్ 2`, `పుష్ప 2` చిత్రాలు పార్ట్-1 కంటే రెండింతలు వసూళ్లు సాధించి సీక్వెల్ సెంటిమెంట్‌ను బలపరిచాయి. అదే బాటలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో రిలీజ్ అయిన `ధురంధర్ 2 కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రం మొదటి రోజే ఊహించని రీతిలో 236 కోట్లు వసూళ్లను సాధించి అతిపెద్ద ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల జాబితాలో చేరింది.
`ధురంధర్ 2` సాధించిన భారీ విజయం ఇప్పుడు సౌత్ స్టార్ హీరోలను సైతం ఆలోచనలో పడేసింది. ముఖ్యంగా పాన్-ఇండియా హీరోలైన ప్రభాస్, అల్లు అర్జున్ వంటి వారు తమ తదుపరి చిత్రాల కథలపై పునరాలోచనలో పడుతున్నట్లు సమాచారం. బాలీవుడ్ నుంచి ఆదిత్య ధర్ వంటి దర్శకులు కంటెంట్ , మేకింగ్ పరంగా హాలీవుడ్ ప్రమాణాలతో వస్తుండటంతో మన స్టార్ హీరోలు కూడా తమ సినిమాల స్క్రిప్టులను మరింత పకడ్బందీగా మలచుకోవాలని చూస్తున్నారు. పోటీ పెరిగిన తరుణంలో కేవలం స్టార్ ఇమేజ్ మాత్రమే సరిపోదని పవర్ ఫుల్ కంటెంట్ ఉండాలని భావిస్తున్నారు.
`ధురంధర్ 2` సక్సెస్ సహా లాంగ్ రన్ లో ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో ముందే అంచనా వేస్తున్నారు. 2000 కోట్లతో సరికొత్త రికార్డు నమోదు చేస్తుందనే అంచనాలున్నాయి. అదే జరిగితే భారతీయ సినిమా గమనాన్ని మార్చినట్లే. సీక్వెల్స్ ద్వారా బ్రాండ్ వాల్యూను పెంచుకోవడమే కాకుండా కథాబలమున్న చిత్రాలతో ప్రపంచ స్థాయికి చేరవవ్వాలని మేకర్స్ ప్లాన్ మరింత సులభం అవుతుంది. రాబోయే రోజుల్లో మరిన్ని వండర్స్ కు అవకాశం ఉంటుంది.
Advertisement
CJ Advs
Pan India Sequels and sentiments:
Pan India Film Sequels and sentiments
Show comments
Advertisement
Google Ad amp 3
CJ Ads
Advertisement
Google Ad amp 3
CJ Ads