మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ తర్వాత హిట్ మిషన్ అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని రీసెంట్ గానే ప్రకటించారు. తనకి లక్కీ హీరోస్ అయిన వెంకటేష్-కళ్యాణ్ రామ్ లతో తన తదుపరి మూవీ త్వరలోనే మొదలు కాబోతున్నట్టుగా చెప్పి సర్ ప్రైజ్ చేసారు. అనిల్ రావిపూడి ఈసారి ఎలాంటి కాన్సెప్ట్ తో హిట్ ఫార్ములా ను రిపీట్ చేయబోతున్నారో అనే క్యూరియాసిటీ అందరిలో ఉంది.
ఇక ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ కి స్పేస్ ఉంది అని అందులో ఓ హీరోయిన్ గా కీర్తి సురేష్ ని ఎంపిక చేసిన అనిల్ రావిపూడి వెంకీ కోసం మరో హీరోయిన్ ని సెట్ చేసే పనిలో ఉన్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న అనిల్ రావిపూడి వెంకీ-కళ్యాణ్ రామ్ మూవీని జులై నుంచి షూటింగ్ మొదలు పెట్టబోతున్నారట.
కేవలం ఆరు నెలల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసి 2027 సంక్రాంతికి సినిమాని విడుదల చేసే ప్లాన్ లో అనిల్ రావిపూడి ఉన్నారు. అయితే అనిల్ రావిపూడి-వెంకీ-కళ్యాణ్ రామ్ మూవీ నుంచి రేపు ఉగాది కి ఏదైనా అప్ డేట్ వస్తుందేమో చూడాలి.