యంగ్ టైగర్ ఎన్టీఆర్-నీల్ కలయికలో ఎప్పుడో మొదలైన డ్రాగన్(వర్కింగ్ టైటిల్) చిత్రం షూటింగ్ విషయాలేవీ అభిమానులకు అందడం లేదు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న డ్రాగన్ మూవీ షూటింగ్ రీసెంట్ గానే జోర్డాన్ షెడ్యూల్ ముగించుకుని ఇండియాకి తిరిగొచ్చారు. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ అలాగే విలన్ రోల్ చేస్తున్న మలయాళ స్టార్ తోవినో థామస్ పై పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ ని ప్రశాంత్ నీల్ తెరకెక్కించారని టాక్.
అయితే గత ఏడాది మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు #NTRNeel చిత్రాన్ని అనుకున్న తేదీకే రిలీజ్ చేస్తామని మాటిచ్చారు. కానీ దానిని తప్పారు. ఇక ఇప్పటివరకు #NTRNeel అప్ డేట్ ఇవ్వకుండా ఆడుకుంటున్న నిర్మాతలు తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో #NTRNeel మూవీపై లీకులు వదిలారు.
జోర్డాన్ లో తెరకెక్కించిన డ్రాగన్ ఎపిసోడ్ విజువల్స్ మతిపోగొడతాయి అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్ ని మైత్రి ప్రొడ్యూసర్ రివీల్ చేసారు. అయితే అసలు ఒక అప్ డేట్ ఇవ్వకుండా ఇలా లీకులు వదలడమెందుకు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నా.. ఏదో ఒక న్యూస్ బయటైతే వచ్చిందిగా అని మరోపక్క సర్దుకుపోతున్నారు.