మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ డిఫరెంట్ జానర్లను ఎంచుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం `కొరియన్ కనకరాజు`. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో హారర్ కామెడీగా తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ ఇప్పుడు తుది దశకు చేరుకుంది. తాజా సమాచారం ప్రకారం, చిత్ర యూనిట్ ఈ సినిమా చివరి షెడ్యూల్ కోసం దక్షిణ కొరియాకు పయనమైంది. అక్కడ కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించేందుకు దర్శకుడు పక్కా ప్లాన్‌తో సిద్ధమయ్యారు.
దక్షిణ కొరియాలోని అందమైన లొకేషన్లలో వారం రోజుల పాటు చిత్రీకరణ జరగనుంది. ఈ షెడ్యూల్‌లో హీరో వరుణ్ తేజ్‌తో పాటు హీరోయిన్ రితికా నాయక్, కమెడియన్ సత్యపై కీలకమైన సీన్స్ , పాటలను చిత్రీకరించనున్నారు. ఇప్పటికే ఇండియాలో మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా, కొరియా షెడ్యూల్‌తో టోటల్ టాకీ పార్ట్‌ను ముగించుకోనుంది.
యూవీ క్రియేషన్స్ , ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇండియా - కొరియా నేపథ్యంలో సాగే ఈ కథలో వరుణ్ తేజ్ మునుపెన్నడూ చూడని సరికొత్త గెటప్‌లో కనిపించబోతున్నారు. వరుణ్ పుట్టిన రోజున విడుదలైన టైటిల్ గ్లింప్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
కొరియా షెడ్యూల్ పూర్తయిన వెంటనే చిత్ర యూనిట్ హైదరాబాద్‌కు తిరిగి రానుంది. ఆ వెంటనే ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్ వంటి పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేసి, సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు భావిస్తున్నారు.