Advertisement
Google Ads BL

అంబ‌టి న‌ట‌నా రంగంలోకి ప్ర‌వేశం


రాజకీయాల్లో తనదైన శైలిలో విమర్శలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇప్పుడు వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తనకు నటనపై ఆసక్తి ఉందని, ఎవరైనా దర్శకులు లేదా నిర్మాతలు మంచి అవకాశం ఇస్తే తప్పకుండా సినిమాల్లో నటిస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ప్రత్యర్థులపై తన వాగ్ధాటితో విరుచుకుపడే అంబటి ఇప్పుడు నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకోవడం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Advertisement
CJ Advs

అంబటి రాంబాబు గతంలో కూడా పలు సందర్భాల్లో తనలోని కళాకారుడిని బయటపెట్టారు. ముఖ్యంగా పండుగ సమయాల్లో ఆయన వేసే డాన్సులు, వేదికలపై ఆయన చేసే సందడి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యేవి. అంబటిలో మంచి టైమింగ్, గంభీరమైన గొంతు ఉండటంతో ఆయనకు సరిపోయే పాత్రలు పడితే నటుడిగా రాణించే అవకాశం ఉందని ఆయన అభిమానులు భావిస్తున్నారు. 

ఒకవేళ నిజంగానే వెండితెరపై కనిపిస్తే రాజకీయాల నుండి సినిమాల్లోకి వెళ్లి రాణించిన ఇతర నాయకుల జాబితాలో అంబటి రాంబాబు కూడా చేరడం ఖాయం.

Ambati Rambabu To Make silver screen debut:

Ambati Rambabu Acting debut Soon
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs