Advertisement
Google Ads BL

ఆర్సీ 17 నాయిక‌గా క‌పూర్ బ్యూటీ


మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ 17వ చిత్రం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో లాక్ అయిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే ఈ సినిమ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర వేగంగా జ‌రుగుతున్నాయి. అయితే ఈ సినిమా లో  హీరోయిన్ ఇంకా ఫైన‌ల్ కాలేదు. స‌మంత‌, ర‌ష్మికా మంద‌న్నా, కృతిస‌న‌న్ ఇలా కొంత మంది పేర్ల‌ను ప‌రిశీ లిస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది గానీ వాళ్ల‌పై సుకుమార్ ఎంత మాత్రం ఆస‌క్తిగా లేడు.

Advertisement
CJ Advs

 

ఇప్ప‌టికే వాళ్ల‌తో సుకుమార్ ప‌ని చేసాడు. రామ్ చ‌ర‌ణ్ కూడా ర‌ష్మిక మినిహా అంద‌రితోనూ వ‌ర్క్ చేసాడు. ఈనేపథ్యంలో మ‌రోసారి అదే భామ‌ల‌ను రిపీట్ చేయ‌డానికి చ‌ర‌ణ్ స‌హా సుకుమార్ ఎంత మాత్రం ఆస‌క్తి చూపించ‌రు. సుకుమార్ మ‌న‌సులో మాత్రం  బాలీవుడ్ న‌టి శ్ర‌ద్దాక‌పూర్ ఉందిట‌. చ‌ర‌ణ్ కి జోడీగా ఆమె అయితే ప‌ర్పెక్ట్ గా సూటువుతంద‌ని త‌న టీమ్ తో డిస్క‌స్ చేస్తున్నాడుట‌. టాలీవుడ్ కి ఈ భామ కొత్తేం కాదు.

 

`సాహో` సినిమాతో అమ్మ‌డు ఇక్క‌డ లాంచ్ అయింది. కానీ ఆ సినిమా హిందీ మార్కెట్ లో మిన‌హా తెలుగులో వ‌ర్కౌట్ అవ్వ‌లేదు. ఇదే విష‌యాన్ని సుకుమార్ ముందు టీమ్ స‌భ్యుడు ఒక‌రు ఉంచాడుట‌. కానీ ఆ విష‌యాన్ని సుకుమార్ పెద్ద‌గా క‌న్సిడ‌ర్ చేయ‌లేదుట‌. పాత్ర స‌హా చ‌ర‌ణ్ కు జోడీగా బాగుంటుందా?  లేదా? అన్న‌దే ఆలోచ‌న చేస్తున్నాడుట‌.  అంత‌మంగా నిర్ణ‌యం తీసుకునేది సుకుమార్ కాబ‌ట్టే అత‌డి చేతుల్లోనే ఉంది. హీరోయిన్ విష‌యంలో చ‌ర‌ణ్ కూడా ఇన్వాల్వ్ కాడు. ద‌ర్శ‌కుల‌పైనే ఆ భారాన్ని పెట్టేసి సైలెంట్ గా ఉంటాడు.

Shraddha Kapoor in RC17 movie:

Shraddha Kapoor To Romance Ram Charan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs