మెగాస్టార్ చిరంజీవి 158వ సినిమా బాబి దర్శకత్వంలో లాక్ అయిన సంగతి తెలిసిందే. అతి త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. అయితే ఈ సినిమా ఎలాంటి కంటెంట్ తో తెరకెక్కుతుంది? అన్నది మెగా ప్రేక్షకాభినుల్లో ఆసక్తికరంగా మారింది. `వాల్తేరు వీరయ్య` తో అన్నయ్యను మాస్ స్టార్ గా చూపించాడు.
ఇటీవలే రిలీజ్ అయిన `మన శంకర వరప్రసాద్ గారు`లోనూ చిరంజీవి పాత్రను క్లాస్ అండ్ మాస్ గా హైలైట్ చేసాడు అనీల్ రావిపూడి . ఈ నేపథ్యంలో కొత్త సినిమాలో బాబి , బాస్ ని ఎలా చూపిస్తాడు? అన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే క్లాస్ అండ్ మాస్ స్టార్ గా చూపిస్తాడు? అనే ప్రచారం జరుగుతోంది. అయితే మెగా అభిమానులు మాత్రం అన్నయ్యను ఈసారి వెండి తెరపై సరికొత్తగా చూపించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.
చిరంజీవిలో మాస్ కోణాన్ని చాలా సినిమాల్లో చూసాం. క్లాసిక్ హీరోని చూసింది మాత్రం చాలా తక్కువ సినిమాల్లోనే. కాబట్టి చిరంజీవిని క్లాసిక్ యాక్షన్ స్టార్ చూపిస్తే బాగుంటుందని ఆశీస్తున్నారు. మరి బాబి అన్నయ్యను ఎలా చూపించాలనుకుంటున్నాడు? అన్నది రాబోయే రోజుల్లో క్లారిటీ దొరుకుతుంది.
చిరంజీవి కూడా తెరపై కొత్తగా కనిపించాలని ఆశీస్తున్నారు. ఎమ్ ఎస్ జీ కథ చెప్పగానే కొత్తగా ట్రై చేద్దాం అని చిరంజీవి భావించారు. కానీ దర్శకుడు అనీల్ రావిపూడి ఆ ఛాన్స్ తీసుకోలేదు. తాను చెప్పింది చేస్తే చాలు అనేసాడు. చిరంజీవి వేలు పెట్టిన సినిమాలు కూడా ఆశించిన ఫలితాలు సాధించలేదు. ఈ నేపథ్యంలో అన్నయ్యను బాబి ఎంత వరకూ ఇన్వాల్స్ చేస్తున్నాడు? తనకెంత ప్రీడమ్ ఇచ్చారు? అన్నది చూడాలి.