రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `టాక్సిక్` చిత్రాన్ని మార్చి 19న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే రోజు బాలీవుడ్ చిత్రం` ధురంధర్ 2` రిలీజ్ కు ఉన్నా? పోటీగా బరిలోకి దిగుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే తాజాగా `టాక్సిక్` ను అధికారికంగా వాయిదా వేసారు. దీనికి సంబంధించి కొద్ది సేపటి క్రితమే అధికారిక ప్రకటన వచ్చేసింది.
ఉగాది కానుకగా మార్చి 19న రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఏప్రిల్ 4వ తేదీకి వాయిదా వేసారు. మరి వాయిదాకు గల కారణాలు ఏంటి? అంటే అంతర్జాతీయ ఉద్రిక్తతలు కారణంగానే తాత్కాలికంగా వాయిదా వేసారు. ప్రస్తుతం మధ్యప్రాచ్య దేశాలలో నెలకొన్న యుద్ధ వాతావరణం ,అనిశ్చితి వల్ల గల్ఫ్ దేశాల్లో సినిమా విడుదలపై ప్రభావం పడే అవకాశం ఉంది.
ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.`టాక్సిక్ ని కేవలం భారతీయ భాషల్లోనే కాకుండా ఇంగ్లీష్ లో కూడా ఏకకాలంలో విడుదల చేస్తున్నారు. అందుకే విదేశీ మార్కెట్ అనుకూలంగా ఉండే వరకు వేచి చూడాలని నిర్ణయించారు. `టాక్సిక్` వాయిదాతో `ధురంధర్ 2`కి లైన్ క్లియర్ అయింది.
అయితే `ధురంధర్ 2` కూడా రిలీజ్ అయ్యే వరకూ చెప్పలేం. ఆ చిత్రాన్ని కూడా ఇతర దేశాల్లో రిలీజ్ చేయనున్నారు. అయితే `ధురంధర్` కి గల్ప్ దేశాల నుంచి ఆశించిన రెస్పాన్స్ రాలేదు. అక్కడ వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో అక్కడ పెద్దగా ప్రభావం పడలేదు. దీంతో `ధురంధర్ 2`ని ఇండియాలో ముందుగా రిలీజ్ చేసినా పెద్దగా సమస్య ఉండదు. అయితే పైరసీ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాయిదాకు ఛాన్స్ తీసుకోవచ్చు.