Advertisement
Google Ads BL

ప‌గ‌లు , రాత్రి తేడా లేకుండా బ‌న్నీ కోసం


ఒక సినిమా కోసం స్క్రిప్ట్ ద‌శ‌లో రైటింగ్ ఎలా ప‌ని చేస్తుందో  చెప్పాల్సిన ప‌నిలేదు. డై అంట్ నైట్ టీమ్ అంతా అదే ప‌ని మీద ఉంటుంది. డైరెక్ట‌ర్ ఆదేశాల మేర‌కు టీమ్ అంతా ప‌ని చేయాల్సి ఉంటుంది. ఇన్ టైమ్ లో స్క్రిప్ట్ సిద్దం చేయాలంటే హార్డ్ వ‌ర్క్ త‌ప్ప‌దు. ఒక‌వేళ డైరెక్ట‌రే రైటర్ అయితే ఆ భారం మొత్తం మోయాల్సింది అత‌డే. ఇప్పుడంతా డైరెక్ట‌ర్లుగా రాణిస్తున్న వారంతా రైట‌ర్లే.

Advertisement
CJ Advs

 

దీంతో స్క్రిప్ట్ ద‌శ నుంచే డైరెక్ట‌ర్ కం రైట‌ర్ల‌కు  స్క్రిప్ట్ మొద‌లు పెట్టిన ద‌గ్గ‌ర నుంచి అది ప‌ట్టాలెక్కించి  పూర్తి చేసే వ‌ర‌కూ ఎంతో క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తోంది. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా  కోసం అట్లీ ఎంత‌గా శ్ర‌మిస్తున్నాడో రివీల్ చేసాడు.  స్క్రిప్ట్ మొద‌లు పెట్టిన‌ప్ప‌టి నుంచి నేటి వ‌ర‌కూ ఒకే లా ప‌ని చేయాల్సి వ‌స్తోంద‌న్నాడు.

 

రాసే స‌మ‌యంలో ఎంతో బాండ్ అయి ప‌ని చేయాల్సి ఉంటుంద‌ని.. షూటింగ్ మొద‌లైన త‌ర్వాత  కూడా అదే త‌ర‌హాలో ప‌ని చేస్తున్నామ‌న్నారు. ఇలా అన్ని సినిమాల‌కు కష్ట‌ప‌డాల్సిన ప‌ని ఉండ‌ద‌ని.. ద‌ర్శ‌కుడిగా ఓ ఇమేజ్ ఏర్ప‌డిన త‌ర్వాత వ‌చ్చిన బాధ్య‌త‌తో మ‌రింత హుందాగా ప‌ని చేయాల్సి ఉంటుంద‌న్నాడు.

 

ప్ర‌స్తుతం బ‌న్నీ సినిమా కోసం త‌న‌తో స‌హా టీమ్ అంతా అలాగే ప‌ని చేస్తున్నామ‌న్నారు. షూటింగ్ కోసం డే అండ్ నైట్ ప‌ని చేయ‌డం..అవ‌స‌రం మేర సెట్స్ లో అప్ప‌టిక‌ప్పుడు మార్పులు చేయ‌డం ఇదంతా చిన్న విష‌యం కాద‌న్నారు. ఈ విష‌యంలో త‌న రైటింగ్ టీమ్ ఎంతో సహ‌క‌రిస్తుంద‌న్నాడు.  

Atlee talks about working sleepless nights on Allu Arjun film:

Atlee spending sleepless nights for Allu Arjun film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs