Advertisement
Google Ads BL

ఇమ్మాన్యుయేల్ బాధ వర్ణనాతీతం


బిగ్ బాస్ సీజన్ 9 లో ఎలాగైనా బిగ్ బాస్ ట్రోఫీ అందుకుంటాడు అనుకున్న కమెడియన్ ఇమ్మాన్యుయేల్ కనీసం టాప్ 3 లో కూడా లేకుండా పోవడం ఆడియన్స్ కి షాకిచ్చింది. సీజన్ 9 లో అటు ఆట, ఇటు మాట, అలాగే కామెడీ తో అద్భుతమైన పెరఫార్మెన్స్ ఇచ్చిన ఇమ్మాన్యుయేల్ టాప్ 2 లో ఖచ్చితంగా ఉంటాడనుకున్నారు.

Advertisement
CJ Advs

కానీ ఇమ్మాన్యుయేల్ టాప్ 4 కి పరిమితమయ్యాడు, దానితో చాలామంది అప్ సెట్ అయ్యారు. ఆ సీజన్ కి కళ్యాణ్ విన్నర్ గా, తనూజ రన్నర్ గా నిలిచారు, ఇమ్మాన్యుయేల్ కి ట్రోఫీ రాకపోవడానికి కారణం నామినేషన్స్ లోకి రాకపోవడంతో ఓటింగ్ లేకుండా పోయింది. తాజాగా ఆయన బిగ్ బాస్ 9 రీ యూనియన్ ప్రోగ్రాం లో చెప్పిన మాటలు అందరిని కంటతడి పెట్టించాయి.

నేను ట్రోఫీ గెలవాలని మా అమ్మ ఎంతగా కోరుకుందో.. మా అమ్మ నాన్న క్యారేజ్ కట్టుకుని 90 ఊర్లు బైక్ పై తిరుగుతూ నాకు ఓట్లు వెయ్యమని పాంప్లెట్స్ పంచారట. ఆ విషయం తెలిసి నేను ఇప్పటికి బాధపడుతున్న అంటూ ఇమ్మాన్యుయేల్ చెప్పడంతో అక్కడ ఉన్న వారంతా కన్నీటి పర్యంతమయ్యారు.

బిగ్ బాస్ హౌస్ లో 360 డిగ్రీస్ లో గేమ్ ఆడింది ఒక్క ఇమ్మన్యుయెల్ అంటూ భరణి కూడా చెప్పాడు. మరి బిగ్ బాస్ ముగిసి కొన్ని నెలలు గడుస్తున్నా ఇమ్మాన్యుయేల్ ఆ విషయంలో చాలా ఫీలవుతున్నాడు..అనేది మరోసారి స్పష్టమైంది.

Emmanuel Gets Emotional about his Bigg Boss Journey:

Emmanuel on his Bigg Boss Journey
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs