తెలుగులో వరస సినిమాలతో ఏ హీరోయిన్ కి రాని అవకాశాలతో ఓ వెలుగు వెలిగిన శ్రీలీల ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ తో మార్చ్ 26 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొన్నటివరకు టాలీవుడ్ కి అధిక ప్రాధాన్యతనిచ్చిన శ్రీలీల ఇప్పుడు తమిళం పై ఫోకస్ పెట్టింది.
తెలుగు లో వరస సినిమాలతో బాగా డిజప్పాయింట్ అయిన శ్రీలీలకు ఇక్కడ అవకాశాలు తగ్గాయి లేదంటే ఆమె కాదనుకుంటుందో తెలియదు కానీ.. తమిళనాట శ్రీలీల హవా స్టార్ట్ అయ్యింది. శివకార్తికేయన్ తో నటించిన పరాశక్తి డిజాస్టర్, అయినా శ్రీలీల కు కోలీవుడ్ రెడ్ కార్పెట్ వేస్తుంది.
ధనుష్ తో మూవీ అలాగే ధృవ్ విక్రమ్ తో ఓ మూవీ ఇప్పుడు అజిత్ కుమార్ తో ఓ మూవీ కి శ్రీలీల కి ఛాన్స్ వచ్చింది అనే టాక్ ఉంది. మరి ఈ మూడు సినిమాలు లైన్ లోకి వస్తే శ్రీలీల కి తమిళనాట తిరుగుండదు, ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే శ్రీలీల తాజాగా వదిలిన పిక్ చూస్తే మతిపోవాల్సిందే.
క్రీం కలర్ శారీ లో స్లీవ్ లెస్ బ్లౌజ్ లో శ్రీలీల లూజ్ హెయిర్ తో నిజంగా కేక పెట్టించింది. శ్రీలీల అందాలు చూసి యూత్ షాకవుతుంది. అంతలా మతిపోగొట్టేసింది శ్రీలీల. మీరు శ్రీలీల కొత్త ఫోటో పై మీరు ఓ లుక్కెయ్యండి.