ఫిలింఫేర్ సౌత్ 2026 పురస్కారాలను కేరళ కొచ్చిలోని ఓ ప్రయివేట్ వేడుకలో ఘనంగా విజేతలకు అందజేసారు. ఈ వేడుకల్లో పుష్పరాజ్ అల్లు అర్జున్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బ్రహ్మయుగం చిత్రానికి గాను మలయాళం నుంచి మమ్ముట్టి ఉత్తమ నటుడు అవార్డ్ గెలుచుకోగా, పుష్ప 2లో తన అద్భుత నట ప్రదర్శనకు గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నారు.
70వ ఫిలింఫేర్ పురస్కారాలలో పాన్ ఇండియన్ బ్లాక బస్టర్ `పుష్ప 2` పలు అవార్డులను క్లీన్ స్వీప్ చేసింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్ అవార్డులు అందుకోగా దేవీశ్రీకి ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డ్ వచ్చింది. అలాగే ఉత్తమ చిత్రంగా `పుష్ప 2` నిలిచింది. ఇదే వేడుకలో హనుమాన్ లో నటనకు గాను తేజ సజ్జాను ఉత్తమ నటుడు (క్రిటిక్) పురస్కారం లభించింది. ఉత్తమ నటి గా (35 చిన్న కథ కాదు) నివేద థామస్ అవార్డును గెలుచుకున్నారు. ఫారెస్ట్ అధికారితో ఈగో సమస్యలను ఎదుర్కొనే పుష్పరాజ్ గంధపు చెక్కల మాఫియాను ఎలా నడిపించాడు? అసలు అతడి జీవితంలో నిజమైన విలన్ ఎవరు? అన్నది తెరపై చూడాల్సిందే. పుష్ప 2లో బన్ని మ్యానరిజమ్స్, డైలాగులు, డ్యాన్సులు ఇలా ప్రతి విభాగం హైలైట్.