Advertisement
Google Ads BL

ప్రేక్ష‌కులు అలా ఫిక్సైతే మిగ‌తా సీజ‌న్ల ప‌రిస్థితి ఏంటి


సినిమా రిలీజ్ అంటే కేవ‌లం సంక్రాంతి అన్న‌ట్లే స‌న్నివేశం మారిపోయింది. అగ్ర హీరోల నుంచి చిన్న హీరోల వ‌ర‌కూ సంక్రాంతి సీజ‌న్ లో  రిలీజ్ చేసిన ఉత్సాహం మిగ‌తా సీజ‌న్ల‌కు చూపిచ‌డం లేదు. రిలీజ్ చేస్తే సంక్రాంతి లేపక‌పోతే వెయిట్ చేద్దాం అన్న దోర‌ణిలో క‌నిపిస్తున్నారు. ఈ సంక్రాంతి కి రిలీజ్ అయిన సినిమాల‌న్నింటిలో మూడు సినిమాలు మంచి  విజ‌యాలు సాధించాయి.

Advertisement
CJ Advs

 

సంక్రాంతి సీజ‌న్ కావడంతో  కుటుంబ‌మంతా  థియేట‌ర్ కు వ‌చ్చి ఆస్వాదించారు.  దీంతో  ఆ సినిమాలు ఊహించ‌ని లాభాలు తెచ్చి పెట్టాయి. కానీ సంక్రాంతి వెళ్లిన త‌ర్వాత దాదాపు 20 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో ఒక్క సినిమా కూడా స‌రిగ్గా ఆడ‌లేదు. ప్రేక్ష‌కులు థియేట‌ర్ కు వ‌చ్చారంటే ప‌ల‌చ‌గానే క‌నిపించింది.

 

పెద్ద‌గా ఆక్యుపెన్సీ క‌నిపించ‌లేదు. మ‌రి సంక్రాంతి రిలీజ్ ల‌కు  వ‌చ్చిన జ‌నాలు ఈ సినిమాల‌కు ఎందుకు రాలే దంటే?  హీరోల త‌ర‌హాలో ప్రేక్ష‌కులు సంక్రాంతికే  సినిమా చూడాల‌ని ఫిక్స్ అయ్యారా? అన్న సందేహం రావ‌డం స‌హజం. కానీ ప్రేక్ష‌కులు ఇంకా అంత మొండిగా నిర్ణ‌యం తీసుకోలేదు.

 

వారు కూడా అలా ఫిక్సై అయితే మిగ‌తా సీజ‌న్ల‌లో థియేట‌ర్ల‌న్నీ ఖాళీగా ఉండాల్సిందే. ఈ విష‌యంలో జాగ్ర‌త్త ప‌డాల్సింది మేక‌ర్స్. కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తే ప్రేక్ష‌కులు థియేట‌ర్ కు వ‌స్తారు. తొలి షో అనంత‌రం మౌత్ టాక్ తోనే సినిమాను జ‌నాల్లోకి ఎక్కించాలి. అలాగ‌ని  కేవ‌లం ప్ర‌చారంతో స‌రిపోదు. అది జెన్యూన్ కంటెంట్ అయి ఉండాలి. 

Is Audience Showing Interest On Films only during Sankranthi season:

All Eyes On Sankranthi season What Abou Remaining Time <div></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs