Advertisement
Google Ads BL

డాన్ 3: బ‌చ్చ‌న్ - ఖాన్‌ల‌కు రీప్లెస్‌మెంట్


బిగ్ బి అమితాబ్, కింగ్ ఖాన్ షారూఖ్ ల‌కు రీప్లేస్‌మెంట్ ఉంటుందా?  ఇండ‌స్ట్రీని ద‌శాబ్ధాల పాటు ఏల్తున్న ఇద్ద‌రు దిగ్గ‌జ హీరోల‌ను మించేలా ఇప్పుడు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఫ‌ర్హాన్ అక్త‌ర్ చేస్తున్న ప్ర‌య‌త్నం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. 90ల‌లో డాన్ పాత్ర‌తో మెప్పించిన బిగ్ బి అమితాబ్ ని రీప్లేస్ చేస్తూ రెండు డాన్ సీక్వెల్స్‌ లో షారూఖ్ ఖాన్ న‌టించాడు. డాన్, డాన్1, డాన్ 2 సంచ‌ల‌న విజ‌యాలు సాధించాయి. డాన్ లో అమితాబ్ న‌టిస్తే, త‌దుప‌రి రెండు భాగాల‌లో షారూఖ్ న‌టించి మెప్పించాడు.

Advertisement
CJ Advs

అలాంటి మెగా సిరీస్ లో ఇప్పుడు మూడో సినిమాలో ర‌ణ్ వీర్ సింగ్ న‌టిస్తాడ‌ని భావిస్తే, అనూహ్యంగా ద‌ర్శ‌కుడితో కొన్ని విభేధాల కార‌ణంగా అత‌డు ప్రాజెక్ట్ నుంచి చివ‌రి నిమిషంలో త‌ప్పుకున్నాడు. ఆ త‌ర్వాత షారూఖ్ ని తిరిగి డాన్ 3 కోసం ఒప్పించాల‌ని ప్ర‌య‌త్నించిన ఫ‌ర్హాన్ విఫ‌ల‌మ‌య్యాడు. చివ‌రికి త‌న స్నేహితుడు హృతిక్ రోష‌న్ తో ఈ పాత్ర‌ను చేయించాల‌ని భావించినా కుద‌ర‌లేదు.

దీంతో తీవ్ర నిరాశ‌లో ఉన్న ద‌ర్శ‌క‌నిర్మాత కం న‌టుడు ఫ‌ర్హాన్ అక్త‌ర్ .. ఇప్పుడు త‌న‌కు తానుగా బిగ్ ఛాలెంజ్ ని టేక‌ప్ చేయ‌డం ప‌రిశ్ర‌మ‌లో చ‌ర్చ‌గా మారింది. షారూఖ్, ర‌ణ్ వీర్ లేదా హృతిక్ రోష‌న్ డాన్ 3లో న‌టించ‌డానికి అంగీక‌రించ‌క‌పోతే, ఇప్పుడు తానే ఆ పాత్ర‌లో న‌టించేందుకు ఫ‌ర్హాన్ సిద్ధ‌మ‌వుతున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే దీనిని అత‌డు అధికారికంగా ధృవీక‌రించాల్సి ఉంది. అయితే దిగ్గ‌జ హీరోల రేంజు స్టార్ డ‌మ్ ఫ‌ర్హాన్ కి లేక‌పోయినా, అత‌డు ఇలాంటి సాహ‌సం చేస్తుండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అమితాబ్, షారూఖ్ లాంటి దిగ్గ‌జాల‌కు హృతిక్ స‌రైన రీప్లేస్‌మెంట్. ర‌ణ్ వీర్ కంటే కూడా హృతిక్ బెస్ట్ ఆప్ష‌న్. కానీ అత‌డికి కుద‌ర‌లేదు. దీంతో ఫ‌ర్హాన్ ఈ సాహ‌సానికి పూనుకున్నాడు.  

Don 3 - Amitabh bachchan and Shahrukh khan Replacement:

<p class="MsoNormal">Farhan Akhtar To Replace Amitabh bachchan and Shahrukh khan&nbsp;
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs