Advertisement
Google Ads BL

అపచారం చేసి వాదిస్తారేమిటో


ప్రతిరోజు లక్షల్లో దర్శించుకుని తరించే శ్రీవారి ఆలయంలో చిన్న తప్పిదం జరిగినా గొంతెత్తి అరిచే వైసీపీ పార్టీ కల్తీ లడ్డు విషయంలో మాత్రం తమ ప్రభుత్వాన్ని వెనకేసుకురావడం కోసం ఎంత తప్పిదాలు చెయ్యాలో, ఎన్ని మాటలు మాట్లాడాలో అన్ని మాట్లాడుతున్నారు.  శ్రీవారి లడ్డు లో జంతు కొవ్వు కలపలేదని రిపోర్ట్ ఇచ్చినా ఆ విషయంలో ఎక్కడా క్లీన్ చిట్ ఇవ్వలేదు. కానీ వైసీపీ నేతలు ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ లడ్డు లో కల్తీ జరగలేదనివాదిస్తున్నారు.

Advertisement
CJ Advs

జంతు కొవ్వు  కలవలేదు, కేవలం రసాయనాలు కలిసియంటూ వాదిస్తున్నారు వైసీపీ వాళ్ళు, అసలు లడ్డులో కల్తీ నే మహాపచారం. శ్రీవారి లడ్డు లో కల్తీ అంటే అది ఏడేడు జన్మలను వదలని మహాపాపం. కానీ దానిని కెమికల్స్ తో తయారు చేశామని చెప్పడం మహా ఘోరం, లడ్డులోనే కాదు శ్రీవారి దీపారాధనకు అదే నెయ్యి వినియోగిస్తామే, అసలు ఆ మహాపచారానికి లెంపలు వేసుకోకుండా ఇంకా బొంకుతారేంటి.

ఆ తప్పు ఒప్పుకొని వారు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, ఈ విషయమై టీటీడీ మాజీ  ఈవో, విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. తిరుపతి వెంకటేశ్వర స్వామి విషయంలో ఏ చిన్న తప్పు జరిగినా లెంపలేసుకుంటాం, క్షమాపణలు వేడుకుంటాం. పొర్లుదండాలు పెడతాం. ఉప వాసం ఉంటాం. దీక్షలు చేస్తాం. అలాంటిది సాక్షాత్తూ శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వినియోగించిన నెయ్యిని చాలా ప్రణాళికాబద్ధంగా నేరపూరిత ఆలోచనతో రసాయనాలు కలిపేసి, తెలిసీ తప్పు చేసి.. పరీక్షల్లో కల్తీ అని తేలిన తర్వాతా అదే నెయ్యి వినియోగించి ఇంకా తప్పుజరగలేదని అరుస్తారేమిటి.

చిన్న పిల్లలకు ఇచ్చే పాలల్లోనే కల్తీ జరిగితే ఊరుకొని ప్రజలు శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగితే ఊరుకుంటారా.. అది తప్పు కాదంటే అంగీకరిస్తారా, సాక్షాత్తూ వేంకటేశ్వర స్వామివారికి ఎంతో భక్తితో సమర్పించే నైవేద్యంలో నెయ్యి కాకుండా రసాయనాలు కలిపేసిన నూనెలాంటి పదార్థంతో నైవేద్యం పెట్టి అది తప్పు కాదని వాదించడమేంటి, లడ్డూ ప్రసాదానికి వినియోగించిన నెయ్యి కల్తీ అని సాక్ష్యాధారాలతో తేలిపోయింది. చుక్క నెయ్యి లేకుండా రూ.250 కోట్ల బిల్లులు తీసుకున్నారు. ఇంకా అర్థం పర్థం లేని లాజిక్కులు తీసి తప్పు చేయలేదని మాట్లాడతారేంటి, ఈ విషయంలో శ్రీవారి భక్తులు చాలా ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఇంకా కల్తీ కాలేదని వాదిస్తే వారిని తిరగబడి కొడతారు.

Kalthi Ghee:

Kalthi Ghee - Thirumala Laddu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs