తెలుగు భీజాక్షరాల్లో హ్రీం అనే అక్షరానికి ఎంతో ఉన్నతమైన విలువలతో కూడిన అర్థం ఉంది. హ్రీం అనే ఒక్క భీజాక్షరంలో హ, ర, ఈ, మ అనే అక్షరాలున్నాయి. హ అంటే ధర్మం, ర అంటే అర్థం, ఈ అంటే కామం, మ అంటే మోక్షం..హ్రీం అంటే దర్మార్ధ కామ మోక్షాలు కలగలిసిన భీజాక్షరం. ఇప్పటివరకు ఎక్కడా చెప్పని ఒక యదార్థ గాధను ఆధారంగా తీసుకుని ఈ చిత్రానిన తెరకెక్కించారు. శివమ్‌మీడియా పతాకంపై హ్రీం అనే భీజాక్షరంతో తయారైన ఈ సినిమాలో నూతన నటీనటులు పవన్ తాత, డాక్టర్ చమిందా వర్మ జంటగా నటించారు.
హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం వరంగల్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది. హ్రీం చిత్రానికి రాజేష్ రావూరి దర్శకుడు. శ్రీమతి సుజాత మల్లాల సమర్పిస్తున్న ఈ చిత్రానికి శివమల్లాల నిర్మాత. వరంగల్ దగ్గరలోని పెద్ద పెండ్యాల గ్రామంలో తొలి షెడ్యూల్, హైదరాబాద్ హెచ్‌యంటీ కాలనీలోని ఫారెస్ట్ లొకేషన్స్‌లో సెకండ్ షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది చిత్రం.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. కీలక పాత్రల్లో ప్రముఖ నటులు తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, బెనర్జీ, భద్రం, అనింగి రాజశేఖర్ (శుబోదయం సుబ్బారావు), త్రిపురనేని శ్రీవాణి, పూజారెడ్డి, వనితా రెడ్డి తదితరులు నటించారు. కథ–కథనం–దర్శకత్వం – రావూరి రాజేష్
నిర్మాత– శివ మల్లాల