కొద్దిరోజులుగా హీరోయిన్ ఈషా రెబ్బ దర్శకుడు కమ్ నటుడు తరుణ్ భాస్కర్ తో డేటింగ్ లో ఉంది, తరుణ్ భాస్కర్ తన భార్యకు విడాకులిచ్చాక.. ఈషా రెబ్బ తో స్నేహం చేస్తూ ప్రేమలో పడ్డాడు అనే వార్తలు మాములుగా వైరల్ అవ్వలేదు. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బలు కలిసి తిరుమల వెళ్లడం, ఓం శాంతి శాంతి శాంతిలో కలిసి నటించడంతో ఈ రూమర్స్ బాగా వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఓం శాంతి మూవీ ప్రమోషన్స్ లో తరుణ్ భాస్కర్ ఇంకా ఈషా రెబ్బ కి అవే ప్రశ్నలు ఎదురవుతున్నాయి, మీరు డేటింగ్ లో ఉన్నారా అని. అయితే ఈషా రెబ్బ మాత్రం తను డేటింగ్ లో ఉన్నట్లుగా ఒప్పుకున్నది కానీ అది తరుణ్ భాస్కర్ అవునా, కదా అనేది క్లారిటీ ఇవ్వలేదు. తాను డేటింగ్ లో ఉన్నాను అని, అది ఎవరో మీకు తర్వాత చెబుతా అంటుంది.
తను డేటింగ్ లో ఉన్నా కానీ అది ఇంకా మొగ్గ లోనే అంటే ప్రారంభ దశలోనే ఉంది అంటూ ఈషా రెబ్బ కాస్త కన్ఫ్యూజ్ చేసింది. మరి ఈషా రెబ్బ చెప్పే ఆ వ్యక్తి తరుణ్ భాస్కరేనా అనేది ఇప్పుడు అందరిలో మొదలైన అనుమానం.