ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే హిందూ దేశమైన భారత్ పై దండయాత్రలు చేసిన మొఘలులు ఇక్కడ కల్చర్ విధ్వంశానికి పాల్పడ్డారు. హిందూ రాజులను చంపారు. రాణులను అపహరించారు. పిల్లలను కూడా పాశవికంగా చంపారు. రక్తతర్పణం సాగించారు. అంతేకాదు హిందూ దేవాలయాలను, సంస్కృతిని నాశనం చేసారు. అయితే కొందరు హిందూ రాజులు మొఘలుల్ని ఎదురించి విరోచితంగా పోరాడి భయం అంటే ఏంటో నేర్పించారు. దేశం విడిచి పారిపోయేలా తరిమి తరిమి కొట్టారు. మహమ్మద్ గజని 17 సార్లు భారత్ పై దండయాత్ర చేసి అపార సంపదల్ని దోచుకెళ్లాడు. కొందరు రాజులు అతడిని తరిమితరిమి కొట్టారు. అలాంటి గొప్ప భారతీయ చక్రవర్తులు, వీరుల కథలను ఇటీవల బయోపిక్ లుగా తెరకెక్కించేందుకు మన దర్శకనిర్మాతలు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు.
ఇటీవల ద్రౌపది 2 అనే పరిమిత బడ్జెట్ సినిమా ప్రపంచ దేశాలలో విడుదలవుతోంది. ఇది పాన్ ఇండియా కేటగిరీలో పలు భాషల్లో విడుదలవుతోంది. అయితే భారత్ లో సజావుగా విడుదలైనా కానీ, గల్ఫ్ దేశమైన ఖతార్ లో దీనిని విడుదల కానివ్వకుండా అక్కడి ప్రభుత్వం బ్రేక్ వేయడం చర్చగా మారింది. ఈ సినిమా రిలీజ్ కి సెన్సార్ బోర్డ్ అభ్యంతరం చెప్పింది.
దీనికి కారణం ఏమిటో తెలిస్తే విస్తుపోవాల్సిందే. చరిత్ర కాలగమనంలో కలిసిపోయిన కొందరు ముస్లిమ్ రాజుల క్రూరమైన హింసను, పరాజయాలను హైలైట్ చేసిన కారణంగా అది ఖతార్ ప్రజలకు నచ్చదని అక్కడ బ్యాన్ చేసారట. ద్రౌపది 2 సినిమాలో 14వ శతాబ్దపు చరిత్రను చూపించారు. ముస్లిం పాలకులైన మొఘల్ రాజుల క్రూరమైన దండయాత్రలు, ఆ సమయంలో జరిగిన ఘర్షణలను వివాదాస్పదంగా చిత్రీకరించారని ఖతార్ సెన్సార్ బోర్డు అడ్డుకట్ట వేసింది. బౌగోళికంగా రాజకీయంగా, మతపరమైన సున్నిత అంశాలను ఇందులో వివాదాస్పదంగా చూపించారని ఖతార్ సెన్సార్ బోర్డ్ భావిస్తోందట. ఈరోజు ఈ చిత్రం భారతదేశంలో ముఖ్యంగా తెలుగులోను విడుదలైంది. 14వ శతాబ్ధంలోని హోయసల చక్రవర్తి వీర భళ్లాల 3 పాలన, దక్షిణాది రాజ్యాలపై జరిగిన తొలి మొఘల్ దండయాత్రల నేపథ్యంలో కథతో ఈ సినిమా రూపొందింది. ముఖ్యంగా మొహమ్మద్ బీన్ తుగ్లక్ దండయాత్రను ఎదిరించిన స్థానిక యోధుల కథను హైలైట్ చేయడం ఖతార్ సెన్సార్ కి నచ్చలేదు! రిచర్డ్ రిషి వీర సింహ కాడవరాయన్ గా ప్రధాన పాత్రలో నటించారు. ద్రౌపతి దేవిగా రక్షణ ఇందుచూడన్ నటించారు. మొహమ్మద్ బీన్ తుగ్లక్ పాత్రలో చిరాగ్ జాని నటించారు. మోహన్ జి క్షత్రియన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ఇటీవల గల్ఫ్‌లో రణ్ వీర్ సింగ్ `దురంధర్` సినిమాని నిషేధించిన కారణంగా 100 కోట్ల నష్టం వాటిల్లిందని నిర్మాతలు ప్రకటించారు. ఇప్పుడు ద్రౌపది 2కి కూడా అంతో ఇంతో నష్టం వాటిల్లినట్టే.