Advertisement
Google Ads BL

జెరోధా ఫౌండర్ నిఖిల్ కామత్ తో లోకేష్ భేటీ


దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్ లో యువ మంత్రి, ఏపీ ఐటి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వరల్డ్ టాప్ వ్యాపారవేత్తలతో వరసగా భేటీ అవుతున్నారు. ఏపీ కి పెట్టుబడులను ఆకర్షించడంలో నారా లోకేష్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఈ సమావేశాలకు నారా లోకేష్ లుక్ మొత్తం మార్చేసి స్టయిల్ గా రెడీ అయ్యారు. నారా లోకేష్ దావోస్ లో ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ జెరోధా ఫౌండర్ నిఖిల్ కామత్ తో సమావేశమయ్యారు. 

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... ప్లాట్‌ఫామ్ ఇంజనీరింగ్, బ్యాకెండ్ సిస్టమ్స్, ట్రేడింగ్ అల్గోరిథంలు, డేటా అనలిటిక్స్, ఫిన్‌టెక్ ఆర్ అండ్ డీ పై దృష్టి సారిస్తూ విశాఖపట్నంలో టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్‌ను నెలకొల్పండి. ఫిన్‌టెక్ స్టార్టప్‌లను ప్రోత్సహించడం, రాష్ట్ర ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ఎకో సిస్టమ్ ను బలోపేతం చేయడానికి లీడ్ మెంటర్‌గా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌తో భాగస్వామ్యం వహించండి. 

భారతదేశంలో మొట్టమొదటిగా మల్టిపుల్ డెలివరీ ఛానెళ్ల ద్వారా పాఠశాల నుంచి కళాశాల స్థాయి వరకు రాష్ట్రవ్యాప్తంగా ఫైనాన్సియల్ లిటరసీ కార్యక్రమాన్ని రూపొందించి, అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సహకరించాలని నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. లోకేష్ విజ్ఞప్తికి జెరోధా  ఫౌండర్ నిఖిల్ కామత్ స్పందిస్తూ.. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని పేర్కొన్నారు.

Nara Lokesh:

Minister Nara Lokesh
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs