ఇండస్ట్రీ నుంచి పాత నీరు పోవడం..కొత్త నీరు రావడం నిరంతరం జరిగే ప్రక్రియే. అందులోనూ హీరోయిన్ల విషయంలో ఈ సన్నివేశం ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. తెలుగు నటీమణులు క్యూలో ఉన్నా? వారందర్నీ పక్కన బెట్టి పరాయి భాషల్ని తేచ్చే అనవాయితీ ఇప్పటికీ కొనసాగుతుంది. వాళ్లను మాత్రం టాలీవుడ్ భామలు డామినేట్ చేయలేకపోతున్నారు. ఈ ఏడాది కూడా చాలా మంది కొత్త భామలు టాలీవుడ్ లో లాంచ్ అవుతున్నారు. ఓ సారి ఆ వివరాల్లోకి వెళ్తే..
దుల్కార్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న `ఆకాశంలో ఒక తార` చిత్రంతో తెలుగు నటి సాత్విక వీరవల్లి పరిచయం అవుతుంది. పదహారణాల తెలుగు అమ్మాయి ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లతో సాత్విక నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సినిమా సక్సెస్ అయితే అమ్మడికి మంచి అవాకాశాలు వస్తాయి. అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న `ఫౌజీ` చిత్రంతో ఇమ్మాన్వీ ఇస్మాయెల్ ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే.
పాకిస్తాన్ మూలాలున్న భామ ఇప్పటికే నెట్టింట వైరల్ అయింది. అమ్మడు ఓ వీడియోతోనే మంచి డాన్సర్ గా ప్రూవ్ చేసుకుంది. పాన్ ఇండియాలో ఈ సినిమా సక్సెస్ అయితే అవకాశాలు క్యూ కడతాయి. ఇంకా గుణశేఖర్ స్వీయా దర్శకత్వంలో నిర్మిస్తోన్న చిత్రం `యూఫోరియా`. ఇదొక యూత్ ఫుల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. ఇందులో నలుగురైదుగురు నటీనటులున్నా? బాలీవుడ్ నటి సారా అర్జున్ మాత్రం ప్రత్యేకం.
ఈ సినిమా ఆమె మపేరుతోనే మార్కెట్ లోకి వెళ్లాలి. ఇటీవలే రిలీజ్ అయిన `ధురంధర్` సినిమాతో సారా అర్జున్ 1000 కోట్ల నాయికగా మారింది. దీంతో గుణశేఖర్ అండ్ కో సారాని ప్రత్యేకంగా ట్రీట్ చేస్తున్నారు. వీరితో పాటు మరి కొంత మంది భామలు వివిధ రాష్ట్రాల నుంచి టాలీవుడ్ లో లాంచ్ అవుతున్నారు.