ఈ మకర సంక్రాంతికి నెట్‌ఫ్లిక్స్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన తెలుగు సినిమా స్లేట్‌ను అనౌన్స్ చేసింది. బిగ్ స్క్రీన్ విజువల్ స్పెక్టకిల్స్‌తో పాటు స్టార్‌లు నడిపించే పవర్ ఫుల్ కథలతో రూపొందిన ఈ లైనప్, ముందుగా థియేటర్లలో విడుదలై, అనంతరం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ స్లేట్ ద్వారా నెట్‌ఫ్లిక్స్ తెలుగు సినిమాపై తన నిరంతర నిబద్ధతను మరోసారి స్పష్టం చేస్తూ, దాని విస్తృత స్థాయి, కథల వైవిధ్యం, అలాగే ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇంపాక్ట్ ను ఘనంగా సెలబ్రేట్ చేస్తోంది.
నెట్‌ఫ్లిక్స్ సౌత్ స్లేట్ 2025లో ఒక మైలురాయి. మాస్ ఎంటర్‌టైనర్‌లు, విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలు అలరించాయి. పుష్ప 2, HIT 3. దే కాల్ హిమ్ OG వంటి క్రౌడ్-ప్లీజర్లు ఒకవైపు. కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ, ది గర్ల్‌ఫ్రెండ్ వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలతో 2025 వైవిధ్యమైన కథలకి నెట్‌ఫ్లిక్స్ నిలయంగా మారింది.
మార్కీ స్టార్‌లతో పాటు ఇప్పటివరకు చూడని కొత్త కథలతో నిండిన 2026 లైనప్, సినిమాను అత్యంత ఉత్కంఠభరితంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. హై-వోల్టేజ్ డ్రామాకు నాంది పలుకుతూ, అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో పవన్ కళ్యాణ్ అలరించనున్నారు. సూపర్ సక్సెస్‌ఫుల్ 2025 తర్వాత, నాని మరింత డార్క్, గ్రిప్పింగ్ జోన్లోకి అడుగుపెట్టి ది పారడైజ్ తో ప్రేక్షకులను థ్రిల్ చేయనున్నారు. ఆకాశంలో ఒక తారలో దుల్కర్ సల్మాన్ భావోద్వేగంతో నడిచే పాత్రలో కనిపించబోతున్నారు. ఫహద్ ఫాసిల్ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్‌లో సర్ప్రైజ్ చేయన్ ఉనంరు. విజయ్ దేవరకొండ పీరియాడిక్-యాక్షన్ చిత్రం VD14 తో తిరిగి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నెట్‌ఫ్లిక్స్ అభిమాన హీరో వెంకటేష్, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉత్కంఠభరితమైన ఆదర్శ కుటుంబం - హౌస్ నంబర్: 47 తో వస్తుండగా, రామ్ చరణ్ జాన్వి కపూర్‌తో కలిసి పెద్దితో అద్భుతంగా ఉన్న ఈ స్లేట్‌కు మరింత జోష్‌ను జోడిస్తున్నారు.
నెట్‌ఫ్లిక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ – కంటెంట్ మోనికా షెర్గిల్ మాట్లాడుతూ.. తెలుగు సినిమా తన విస్తృత స్థాయి, అంబిషస్ కథనాలు, బలమైన భావోద్వేగ అనుసంధానంతో అత్యంత నిబద్ధత గల ప్రేక్షకులను కలిగి ఉంది. 2026 పెద్ద మైన్‌స్ట్రీమ్ ఎంటర్టైనర్ల నుంచి డెప్త్, క్యారెక్టర్ బేస్డ్ చిత్రాల వరకూ గొప్ప కథల కనిపించడం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోంది. Pushpa 2, HIT 3, OG, Court వంటి చిత్రాలు ఈ వైవిధ్యాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. పరిశ్రమ, ప్రేక్షకుల అభిరుచులు ఎలా మారుతున్నాయో దానికి అనుగుణంగా ముందుకు సాగుతూ, క్రియేటివ్ బౌండరీలు దాటే దర్శకులను మేము ప్రోత్సహిస్తూనే, ఈ కథలను విస్తృత స్థాయిలో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే మా లక్ష్యం.
ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్, శ్రీ లీల, రాశి ఖన్నా తమిళం, హిందీ, మలయాళం, కన్నడ
ది ప్యారడైజ్ నాని, కయదు లోహర్ తమిళం, హిందీ, మలయాళం, కన్నడ
ఆకాశములో ఒక తార దుల్కర్ సల్మాన్ తమిళం, హిందీ, మలయాళం, కన్నడ
ఛాంపియన్ రోషన్, అనశ్వర రాజన్ తమిళం, మలయాళం , కన్నడ
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ఫహద్ ఫాసిల్ తమిళం, హిందీ, మలయాళం, కన్నడ
ఫంకీ విశ్వక్ సేన్, కయదు లోహర్ తమిళం, హిందీ, మలయాళం , కన్నడ
ప్రొడక్షన్ నెం 37 హర్ష్ రోషన్, అన్నా బెన్ తమిళ్, హిందీ, మలయాళం , కన్నడ
రాకాస సంగీత్ శోభన్ తమిళం, మలయాళం , కన్నడ
బైకర్ శర్వానంద్, అతుల్ కులకర్ణి, బ్రహ్మాజీ, మాళవిక నాయర్ తమిళం, హిందీ, మలయాళం , కన్నడ
418 చైత్ర ఆర్చర్, శ్రీ వైష్ణవ్, శశాంక్ పాటిల్ తమిళం, హిందీ, మలయాళం , కన్నడ
VD14 - విజయ్ దేవరకొండ-రాహుల్ సంకిత్ర్యాన్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమిళం, హిందీ, మలయాళం , కన్నడ
ఆదర్శ కుటుంబం - హౌస్ సంఖ్య: 47 వెంకటేష్, శ్రీనిధి శెట్టి తమిళం, హిందీ, మలయాళం , కన్నడ
పెద్ది రామ్ చరణ్, జాన్వీ కపూర్ తమిళం, హిందీ, మలయాళం , కన్నడ