గత ఏడాది డిసెంబర్ లో బాలీవుడ్ లో విడుదలైన ధురంధర్ కి బ్రేకులు వేసే మొనగాడే లేడా అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు. సినిమా విడుదలై నాలుగు వారాలైనా ధురంధర్ దూకుడు ఆగట్లేదు. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి మొదటిరోజు స్లోగా స్టార్ట్ అయినా రెండోరోజు నుంచే మౌత్ టాక్ తో బాలీవుడ్ లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
అప్పటినుంచి ధురంధర్ కి కళ్ళు చెదిరే కలెక్షన్స్, నాలుగు వారాలైనా థియేటర్స్ ఆక్యుపెన్సీ తగ్గట్లేదు. ఇప్పటికే పాన్ ఇండియా మూవీ బాహుబలి కలెక్షన్స్ దాటేసింది. బాక్సాఫీసు బరిలో ధురంధర్ దున్నేస్తుంది. అందులో ఆతర్వాత బాలీవుడ్ లో విడుదలైన సినిమాలు ధురంధర్ కి పోటీ లేకపాయే..
ఇక ప్రభాస్ రాజాసాబ్ ధురంధర్ దూకుడు కి కళ్లెం వేస్తుంది అనుకుంటే రాజసాబ్ నార్త్ లో చిన్నబోయింది. ప్రభాస్ సినిమా అయినా నార్త్ ఆడియన్స్ పట్టించుకోలేదు, కారణం ధురంధర్ కంటెంట్ అంతగా కనెక్ట్ అవడమే. మరి ధురంధర్ ఇప్పటికి దూసుకుపోతూనే ఉంది. చూద్దాం ధురంధర్ దూకుడు ఎన్నాళ్ళో అనేది.