Advertisement
Google Ads BL

HIV వ‌స్తుంది జాగ్ర‌త్త‌ - దిశా ప‌టానీకి హెచ్చ‌రిక‌


నుపుర్ సనన్- స్టెబిన్ బెన్ వివాహ వేడుకలో దిశా పటాని - తల్విందర్ జంటగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించిన కొద్దిసేపటికే, తల్విందర్ మాజీ ప్రియురాలు సోనీ కౌర్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపుతోంది. ఈ వివాదానికి సంబంధించిన  వివ‌రాల్లోకి వెళితే...

Advertisement
CJ Advs

 

సోనీ కౌర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఎవరి పేరును నేరుగా ప్రస్తావించకుండా ఒక తీవ్రమైన హెచ్చరికను జారీ చేసారు. దీని అర్థం ఇలా ఉంది. ``కేవలం హెచ్‌.ఐ.వి, ఎస్.టి.ఐలు (లైంగిక వ్యాధులు) మాత్రమే కాదు, ప్రజలు శాపాలను.. దురదృష్టాన్ని కూడా మోస్తుంటారు. మీరు ఎవరితో పడుకుంటున్నారో చూసుకుని జాగ్రత్తగా ఉండండి`` అంటూ ఘాటైన పోస్ట్ తో ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

 

ఈ పోస్ట్ దిశా పటాని- తల్విందర్ రిలేషన్‌షిప్‌ను ఉద్దేశించి చేసినదే అని నెటిజన్లు భావిస్తున్నారు. ముఖ్యంగా తల్విందర్‌తో తనకున్న గతానుభవం ఆధారంగా ఆమె ఈ క్రిప్టిక్ పోస్ట్ చేసారన్న చ‌ర్చ సాగుతోంది. ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు వేగంగా స్పందించారు.

 

ఇది పక్కాగా తల్విందర్ గురించి ఆమె పోస్ట్... వీరిద్దరూ గతంలో రిలేషన్‌లో ఉన్నారని, అందుకే ఆమె ఇలా రియాక్ట్ అయిందని కొందరు కామెంట్ చేస్తున్నారు. ``దిశాను ఆమె హెచ్చరిస్తోంది.. కొత్త రిలేషన్‌లో ఉన్న దిశా పటానిని అప్రమత్తం చేయడానికి సోనీ ఇలాంటి ఘాటైన పదాలు వాడిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

 

ముఖ్యంగా ఈ పోస్ట్ టైమింగ్ అలాంటిది. నుపుర్ సనన్ రిసెప్షన్‌లో దిశా-తల్విందర్ ఫోటోలు బయటకు వచ్చిన కొన్ని గంటలకే ఈ పోస్ట్ రావడం ఈ అనుమానాలకు బలం చేకూర్చింది. గాయ‌కుడు తల్విందర్ -సోనీ కౌర్ గతంలో సన్నిహితంగా ఉండేవారని, అయితే వారి బ్రేకప్ అంత సజావుగా సాగలేదని బాలీవుడ్ ఇన్ సైడర్ టాక్. సోనీ కౌర్ ఒక మోడల్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. ఆమె తరచుగా ఇలాంటి బోల్డ్, స్ట్రెయిట్ ఫార్వర్డ్ పోస్ట్‌లు పెడుతూ వార్తల్లో నిలుస్తుంటారు.

 

బ్రేక‌ప్ ల త‌ర్వాత ఇలాంటి వార్ ఇటీవ‌ల రెగ్యుల‌ర్ గా చూస్తున్నాం. అయితే సోనీ కౌర్ ఏకంగా శాపాలు, వ్యాధుల గురించి ప్రస్తావించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యాఖ్య‌ల‌పై దిశా పటానీ కానీ, తల్విందర్  కానీ స్పందిస్తారేమో చూడాలి. దిశా పటాని కొత్త రిలేషన్ షిప్ వివాదంలోకి వెళుతుంటే ఇది త‌న కెరీర్ గ్రాఫ్ పై ప‌డుతుందా? అంటూ సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దిశా 2026లో అర‌డ‌జ‌ను ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది.

Disha Patani STI and HIV Post whom she is Warning:

<p class="MsoNormal">Disha Patani shocking post on HIV and<span>&nbsp; </span>STI
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs