ఈరోజుల్లో కులమతాలకు సంబంధించిన కథాంశాలను ఎంచుకున్నప్పుడు కచ్ఛితంగా విమర్శల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనోభావాలను దెబ్బ తీస్తే, కోర్టుల వరకూ గొడవలు చేరుకుంటున్నాయి. ఇటీవల కొన్నేళ్లుగా బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ యాంటీ హిందూ ప్రొపగండాను నడిపిస్తోందని నెటిజనులు విరుచుకుపడుతున్నారు.
ఈ సంస్థ నుంచి వచ్చిన మహారాజా చిత్రంలో హిందువులను కించపరిచే అంశాలను చూపించారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. హిందూ మత సాంప్రదాయాలను, గురువులను అవమానించేలా కంటెంట్ ని చూపించారన విమర్శలొచ్చాయి. పఠాన్, టైగర్ 3 లాంటి చిత్రాల్లో పాకిస్తానీ ఏజెంట్లను మంచివారిగా చూపించారని, భారత వ్యతిరేక దేశానికి మద్ధతుగా కొన్ని అంశాలు ఉన్నాయని కూడా విమర్శలొచ్చాయి.
ఇప్పుడు రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో రూపొందించిన మర్ధానీ 3లోను యాంటి హిందూ ప్రొపగండాను అండర్ కరెంట్ గా యష్ రాజ్ ఫిలింస్ వైరల్ చేస్తోందని కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ఇటీవల విడుదలైన టీజర్ పోస్టర్లలో ఈ తరహా కంటెంట్ హిందూ మనోభావాలను దెబ్బ తీస్తోందని విమర్శిస్తున్నారు. ఈ సినిమా 2026 జనవరి 30న విడుదల కాబోతోంది.