హారర్ కామెడీలు అన్ని వేళలా వర్కవుట్ కావు. కామెడీని బలవంతంగా చేర్చినా లేదా కామెడీని సూట్ కాని వారితో చేయించినా ఎలా ఉంటుందో ఇప్పటికే పలు తెలుగు సినిమాల్లో చూశామని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. అలాగే హారర్ చిత్రాలకు సౌండ్ ప్రాధాన్యత ఒకటికి పదింతలు పరిశీలించాల్సి ఉంటుంది. చాలా హాలీవుడ్ హారర్ టెర్రర్ సినిమాలను ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు చూసేసి ఉన్నారు. ఓటీటీ యుగంలో వారికి పరిచయం కాని హారర్ థ్రిల్లర్లు, హారర్ కామెడీలు, హారర్ సంబంధిత సినిమాలు లేనే లేవు. అందువల్ల ఈ రోజుల్లో ఎవరైనా హారర్ థ్రిల్లర్లు లేదా హారర్ కామెడీలు లేదా పైన తెలిసిన ఏ జానర్ సినిమా తీసినా ఫిలింమేకర్స్ అత్యంత జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది కేవలం బడ్జెట్లతో మాత్రమే ముడిపడినది కాదు. ముఖ్యంగా సౌండ్ క్వాలిటీని హైపిచ్ లో ఉపయోగించగలిగేవాడు మాత్రమే హారర్ థ్రిల్లర్లను తీయాల్సి ఉంటుంది.
చాలా కాలం తర్వాత `ఈవిల్ డెడ్ రైజ్` ఫేం `ది మమ్మీ` పేరుతో ఓ హారర్ చిత్రాన్ని తెరకెక్కించి రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ హాలీవుడ్ సినిమా టీజర్ విడుదలైంది. టీజర్ గగుర్పాటుకు గురి చేస్తోంది. ఇది కామెడీలు చేసే టీజర్ కాదు. పూర్తిగా భయపెట్టడంపై దృష్టి సారించిన టీజర్. సినిమా ఆద్యంతం గుండె దడ పుట్టిస్తుంది. పాత మమ్మీ సినిమాలకు ఇది భిన్నమైనది. పురాతన ఈజిప్ట్ నుంచి నేటి కాలానికి కనెక్షన్ ఇస్తూ తీసిన ఈ సినిమా భారతీయ ప్రేక్షకులను కూడా మెప్పిస్తుందని అంచనా వేస్తున్నారు. ఒక నగరనిర్మాణ సమయంలో పురాణ శవపేటిక బయటపడిన తర్వాత అసలు స్టోరి మొదలవుతుంది. సినిమా 2026 దసరా లేదా హలోవీన్ కానుకగా థియేటర్లలోకి వస్తుంది. యూనివర్సల్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇటీవలే `ది రాజా సాబ్` సినిమాని హారర్ కామెడీ జానర్ లో రూపొందించారు దర్శకుడు మారుతి. అతడికి ఈ టీజర్ చూపించాలి అని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు.